హోమ్ / వంటకాలు / మినప్పప్పు పచ్చడి

Photo of MINAPAPPU pachadi by Kavitha Perumareddy at BetterButter
1421
1
0.0(0)
0

మినప్పప్పు పచ్చడి

Sep-25-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప్పప్పు పచ్చడి రెసిపీ గురించి

మినుములు ఇనుముతో సమానం అంటారు అందుకని మనపెద్దలు రకరకాల వంటలలో మినపప్పు ను చేర్చారు . ఎలాగో ఒక లాగా శరీరానికి ఐరెన్ అందుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మినపప్పు చిన్న కప్
  2. ఎండుమిర్చి 20
  3. నూనె 3 స్పూన్స్
  4. చింతపండు నిమ్మకాయ సైజ్
  5. జీలకర్ర స్పున్
  6. ధనియాలు స్పున్
  7. మెంతులు పావుస్పూన్
  8. వెల్లుల్లి రెబ్బలు 6
  9. కరివేపాకు కొద్దిగా
  10. ఇంగువ పావుస్పూన్
  11. ఆవాలు పోపుకు స్పున్
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా చింతపండు కడిగి ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి చిన్న స్పున్ నూనెవేసి మినప్పప్పు వేసి దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి.
  3. తరువాత అదే బాండీలో స్పున్ నూనెవేసి జీలకర్ర, ధనియాలు, మెంతులు,ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.ఇంగువ కూడా వేసుకోవాలి.
  4. తరువాత మిక్షిలో మినప్పప్పు ,ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తరువాత నానబెట్టిన చింతపండు నీటితో సహా వేసి అంతా కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి.గట్టిగా ఉంటే ఇంకొన్ని నీళ్లు వేసి రుబ్బుకోవాలి.
  5. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి ఆవాలు,వెల్లుల్లి, కరేపాకు, వేసి పోపు వేగనివ్వాలి. తరువాత పోపులో పచ్చడిని వేసి కలపాలి .అంతే ఘుమ ఘుమ లాడే మినపప్పు పచ్చడి సిద్ధం .:relaxed:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర