గోంగూర పచ్చడి | Gongura pickle Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gongura pickle by Chandrika Marripudi at BetterButter
గోంగూర పచ్చడిby Chandrika Marripudi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

గోంగూర పచ్చడి వంటకం

గోంగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gongura pickle Recipe in Telugu )

  • గోంగూర : 1 కట్ట
  • పచ్చిమిర్చి : 20
  • అల్లం : చిన్నముక్క
  • వెల్లుల్లి రెబ్బలు : 10
  • ధనియాలు : 1 స్పూను
  • జీలకర్ర : 1 స్పూను
  • ఆవాలు : 2 స్పూన్లు
  • మినప్పప్పు : 2 స్పూన్లు
  • పచ్చిశనగపప్పు : 3 స్పూన్లు
  • ఎండుమిర్చి : 2
  • కరివేపాకు : 2 రెమ్మలు
  • కొత్తిమీర : గుప్పెడు
  • ఉప్పు : తగినంత
  • నూనె : 4 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ : 1 పెద్దది

గోంగూర పచ్చడి | How to make Gongura pickle Recipe in Telugu

  1. గోంగూర ఆకులు తుంచి కడిగి పెట్టుకోవాలి.
  2. స్టవ్ పైన గిన్నె పెట్టి అర గ్లాసు నీళ్ళు పోసి మరిగాక గోంగూర వేసి ఉడికించాలి.
  3. రెండు నిమిషాలు ఉడికించి జల్లెడ గిన్నెలో కి వేయాలి.
  4. ఇపుడు పచ్చిమిర్చి, అల్లం,వెల్లుల్లి, ఉప్పు,జీలకర్ర వేసి మిక్సి పట్టి తరువాత ఉడికించి వార్చిన గోంగూర కూడా వేసి మరొకసారి మిక్సి పట్టుకోవాలి.
  5. స్టవ్ పైనబాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక పచ్చడి పోపులో వేసి ఒక నిమిషం మగ్గించుకోవాలి
  6. చివర్లో కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

Reviews for Gongura pickle Recipe in Telugu (0)