హోమ్ / వంటకాలు / గోంగూర పచ్చడి

Photo of Gongura pickle by Chandrika Marripudi at BetterButter
834
1
0.0(0)
0

గోంగూర పచ్చడి

Sep-25-2018
Chandrika Marripudi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర పచ్చడి రెసిపీ గురించి

గోంగూరతో చాలా రకాలుగా పచ్చడి చేసుకుంటాం.పచ్చిమిర్చి, గోంగూరతో చేసుకునే రోటిపచ్చడి.మిక్సిలో కూడా చేసుకోవచ్చు.కానీ రోట్లో నూరుకుంటే ఆ రుచే వేరు.చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. గోంగూర : 1 కట్ట
  2. పచ్చిమిర్చి : 20
  3. అల్లం : చిన్నముక్క
  4. వెల్లుల్లి రెబ్బలు : 10
  5. ధనియాలు : 1 స్పూను
  6. జీలకర్ర : 1 స్పూను
  7. ఆవాలు : 2 స్పూన్లు
  8. మినప్పప్పు : 2 స్పూన్లు
  9. పచ్చిశనగపప్పు : 3 స్పూన్లు
  10. ఎండుమిర్చి : 2
  11. కరివేపాకు : 2 రెమ్మలు
  12. కొత్తిమీర : గుప్పెడు
  13. ఉప్పు : తగినంత
  14. నూనె : 4 టేబుల్ స్పూన్లు
  15. ఉల్లిపాయ : 1 పెద్దది

సూచనలు

  1. గోంగూర ఆకులు తుంచి కడిగి పెట్టుకోవాలి.
  2. స్టవ్ పైన గిన్నె పెట్టి అర గ్లాసు నీళ్ళు పోసి మరిగాక గోంగూర వేసి ఉడికించాలి.
  3. రెండు నిమిషాలు ఉడికించి జల్లెడ గిన్నెలో కి వేయాలి.
  4. ఇపుడు పచ్చిమిర్చి, అల్లం,వెల్లుల్లి, ఉప్పు,జీలకర్ర వేసి మిక్సి పట్టి తరువాత ఉడికించి వార్చిన గోంగూర కూడా వేసి మరొకసారి మిక్సి పట్టుకోవాలి.
  5. స్టవ్ పైనబాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక పచ్చడి పోపులో వేసి ఒక నిమిషం మగ్గించుకోవాలి
  6. చివర్లో కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర