కంది పచ్చడి | Tur dal pachadi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tur dal pachadi recipe in Telugu,కంది పచ్చడి, Sree Vaishnavi
కంది పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    7

    జనం

1

0

కంది పచ్చడి వంటకం

కంది పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tur dal pachadi Recipe in Telugu )

  • 1/2 కప్ కందిపప్పు
  • 1/2 చెంచా జీలకర్ర
  • 1 చెంచా మినపప్పు
  • 3-4 ఎండుమిరపకాయలు
  • 3-4 వెల్లులి రెబ్బలు
  • నిమ్మకాయ అంత చింతపండు
  • 2-3 చెంచాలు నూనె
  • 1/2 చెంచా ఆవాలు
  • 1 చెంచా మినపప్పు
  • 10-12 కరివేపాకు ఆకులు
  • 1 చెంచా నూనె

కంది పచ్చడి | How to make Tur dal pachadi Recipe in Telugu

  1. ముందుగా ఒక పెనం పెట్టి అందులో నూనె వేసి కంది పప్పు వేసి మంచి వాసన వచ్చే అంతవరకు వేయించాలి
  2. అందులో నుంచి తీసేసి అందులో నీళ్లు పోసి వెంటనే నీళ్లు వార్చేయాలి
  3. ఇప్పుడు మళ్ళి పెనం పెట్టి అందులో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు మినపప్పు, వెల్లులి రెబ్బలు, చింతపండు వేసి వేయించాలి
  4. దానిని మరియు కందిపప్పు ఉప్పు మిక్సీ జార్ లో నీళ్లు పోసుకుని ముద్ద లా చేసుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళి బాండి పెట్టి అందులో నూనె ,మినపప్పు , కరివేపాకు, ఆవాలు వేసి వేయించాలి
  6. ఆ పోపుని పచ్చడిలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

Reviews for Tur dal pachadi Recipe in Telugu (0)