బీరకాయ కొబ్బరి పచ్చడి | BEERAKAYA kobbari pachadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BEERAKAYA kobbari pachadi recipe in Telugu,బీరకాయ కొబ్బరి పచ్చడి, Kavitha Perumareddy
బీరకాయ కొబ్బరి పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

బీరకాయ కొబ్బరి పచ్చడి వంటకం

బీరకాయ కొబ్బరి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BEERAKAYA kobbari pachadi Recipe in Telugu )

  • బీరకాయ 1
  • పచ్చి కొబ్బరి ఒక చిప్ప
  • పచ్చిమిర్చి 10 లేదా 12
  • టమాటాలు 2
  • పసుపు కొద్దిగా
  • జీలకర్ర 1 స్పున్
  • ధనియాలు స్పున్
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా
  • నూనె 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • వెల్లుల్లి రెబ్బలు 5

బీరకాయ కొబ్బరి పచ్చడి | How to make BEERAKAYA kobbari pachadi Recipe in Telugu

  1. ముందుగా బీరకాయ ,కొబ్బరి శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరగాలి.అన్ని వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర ,ధనియాలు, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. తరువాత కొబ్బరిముక్కలు కూడా వేసి 5 నిముసాలు వేపుకొని పక్కకు తీసుకోవాలి.
  3. మళ్ళీ బాండీలో స్పున్ నూనె వేసి బీరకాయ, టమాటా ముక్కలు,పసుపు,వెల్లుల్లి రెబ్బలు , కరివేపాకు,కొత్తిమీర ,తగినంత ఉప్పు వేసి 5 నిముసాలు మూత పెట్టి మగ్గించుకోవాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి, కొబ్బరి వేసి బాగా మెత్తగా దంచుకోవాలి.
  5. కొబ్బరి మెత్తగా ఇనాక బీరకాయ,టమాటా మిశ్రమం వేసి అంతా కలిపి దంచుకోవాలి .తరువాత గిన్నెలో తీసుకోవాలి.కొత్తిమీరతో అలంకరించాలి .ఈ పచ్చడికి పోపు వేయకున్న బాగుంటుంది.

నా చిట్కా:

వంట చేసేటప్పుడు మూత పెట్టి మగ్గిస్తే తొందరగా మగ్గుతుంది.

Reviews for BEERAKAYA kobbari pachadi Recipe in Telugu (0)