హోమ్ / వంటకాలు / గోరుచిక్కుడు పచ్చడి

Photo of GORUCHIKKUDU pachadi by Kavitha Perumareddy at BetterButter
1242
0
0.0(0)
0

గోరుచిక్కుడు పచ్చడి

Sep-26-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోరుచిక్కుడు పచ్చడి రెసిపీ గురించి

చాలా మందికి ఈ గోరుచిక్కుడు అంటే నచ్చదు.పిల్లలకు అస్సలు నచ్చదు .కానీ ఏదో ఒకలా తినిపించాలి కదా ...ఇలా చేస్తే నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. గోరుచిక్కుడు కాయలు పావుకేజీ
  2. పచ్చిమిర్చి 15
  3. జీలకర్ర స్పున్
  4. ఉప్పు తగినంత
  5. చింతపండు కొద్దిగా
  6. పసుపు కొద్దిగా
  7. నూనె 2 స్పూన్స్
  8. పోపుగింజలు స్పున్
  9. కరివేపాకు కొద్దిగా
  10. ఎండుమిర్చి 2 పోపుకు
  11. వెల్లుల్లి రెబ్బలు 5

సూచనలు

  1. ముందుగా గోరుచిక్కుడు కాయలు కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.మిగతా పదార్దాలు కూడా రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా జీలకర్ర ,తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. తరువాత చింతపండు, గోరుచిక్కుడు ముక్కలు వేసి బాగా దంచుకోవాలి.అన్ని పచ్చివే దంచుకోవాలి.
  3. దంచిన తరువాత పోయిమీద బాండీ పెట్టి నూనె వేసుకొని పోపుగింజలు ,ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు వేగిన తరువాత దంచుకున్న పచ్చడి వేసి కలపాలి.కొద్దిగా పసుపు కూడా వేసి కలిపి చిన్న మంట మీద 10 నిముసాలు ఉంచాలి.పచ్చి వాసన పోయే వరకు ఉండాలి. తరువాత వేరే గిన్నెలో తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర