ములక్కాడ నిల్వ పచ్చడి | Drumstick pickle Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Drumstick pickle recipe in Telugu,ములక్కాడ నిల్వ పచ్చడి, Sudha Badam
ములక్కాడ నిల్వ పచ్చడిby Sudha Badam
  • తయారీకి సమయం

    40

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

4

0

ములక్కాడ నిల్వ పచ్చడి వంటకం

ములక్కాడ నిల్వ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick pickle Recipe in Telugu )

  • ములక్కాడలు 3
  • చింతపండు గుజ్జు 3/4 కప్పు
  • కారం 4 స్పూన్లు
  • ఉప్పు 4 స్పూన్లు
  • మెంతిపిండి 1/2 స్పూను
  • నూనె 1/2 కప్పు
  • పోపు దినుసులు-ఆవాలు, ఎండుమిర్చి,జీలకర్ర
  • వెల్లులిపాయలు 8
  • ఇంగువ కొద్దిగా

ములక్కాడ నిల్వ పచ్చడి | How to make Drumstick pickle Recipe in Telugu

  1. ముందుగా చింతపండుని నానబెట్టుకుని, గుజ్జు తీసుకుని, పులిహోర పులుసు ఉడికించినట్టుగా ఉడికించుకుని చల్లార్చి పక్కన ఉంచుకోవాలి.
  2. పాన్ లో నూనె వేసుకుని ములక్కాడ ముక్కలు కొద్దిగా రంగు మారెవరుకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లులి, ఇంగువ వేసి పోపు పెట్టుకుని పోపు వేగేక స్టవ్ ఆపి పోపు చల్లార్చుకోవాలి.
  4. ఒక బౌల్ లోకి వేయించిన ములక్కాడ ముక్కలు తీసుకుని వాటి మీద చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, మెంతిపిండి వేసి బాగా కలిపి ఈ పోపు కూడా వేసి కలుపుకోవాలి.

నా చిట్కా:

వెల్లులి వేసుకోకపోయిన బానే ఉంటుంది.

Reviews for Drumstick pickle Recipe in Telugu (0)