హోమ్ / వంటకాలు / కొరివి కారం

Photo of Korivi karam by Sree Sadhu at BetterButter
688
4
0.0(0)
0

కొరివి కారం

Sep-26-2018
Sree Sadhu
2170 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొరివి కారం రెసిపీ గురించి

దీనికి పోపు తినేముందు పెట్టుకోవాలి ఆ పోపు ని పచ్చడిలో వేసి వేడి వేడి అన్నం లో పచ్చడి వేసుకుని నెయ్యి ఎసుకుని తినాలి దీనికి తడి తగలకుండా ఉంటే నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పండు మిరపకాయలు 1 కేజీ
  2. చింతపండు 150-200 గ్రాములు
  3. కళ్ళు ఉప్పు 100 గ్రాములు
  4. ఆవ పొడి 1 చెంచా
  5. మెంతి పొడి 1 చెంచా
  6. ఇంగువ చిటికెడు
  7. పసుపు చిటికెడు
  8. ఎండుమిరపకాయ 1
  9. నూనె 6 చెంచాలు
  10. ఆవాలు 1 చెంచా
  11. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఫ్రెష్ పండుమిరపకాయలు తీసుకుని ఒక తడి గుడ్డ తో తుడుచుకోవాలి
  2. దానిని ఆరబెట్టుకోవాలి
  3. ఇప్పుడు వాటి తొడిమలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసుకోవాలి
  5. గ్రైండ్ చేసుకున్న దానిలో ఉప్పు ,పసుపు, చింతపండు వేసుకొవాలి
  6. దానిని బాగా కలిపి 3 రోజులు జాడి లో ఉంచుకోవాలి
  7. ఇప్పుడు అందులోంచి మనకు కావలిసినంత తీసుకుని అందులో ఆవ పొడి ,మెంతి పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని అందులో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి, ఇంగువ వేసి వేగిన తరువాత అందులో వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర