పెసరపప్పు కటిక పచ్చడి. | Yellow moong daal chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Yellow moong daal chutney. recipe in Telugu,పెసరపప్పు కటిక పచ్చడి., దూసి గీత
పెసరపప్పు కటిక పచ్చడి.by దూసి గీత
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పెసరపప్పు కటిక పచ్చడి. వంటకం

పెసరపప్పు కటిక పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Yellow moong daal chutney. Recipe in Telugu )

 • కావల్సిన పదార్థాలు :
 • పెసరపప్పు : 1 కప్పు.
 • ఎండుమిర్చి : 5.
 • ఉప్పు : 1 చెంచా.
 • జీలకర్ర : 1/4, చెంచా.
 • చింతపండు : చిన్న ఉసిరి కాయంత.
 • ఇంగువ : చిటికెడు.
 • ఉల్లిపాయ ముక్కలు : 1/2 కప్పు.
 • నిమ్మకాయ : 1 చెక్క.

పెసరపప్పు కటిక పచ్చడి. | How to make Yellow moong daal chutney. Recipe in Telugu

 1. కటిక పచ్చడి అని పేరు చూసి కంగారు పడకండి.పచ్చి పెసరపప్పు తో చేస్తాం అందుకే ఆ పేరు.
 2. పెసరపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర,ఇంగువ, చింతపండు అన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
 3. చివరి లో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి తిప్పి తీసేయాలి. అంతే చాలా సింపుల్.. నిమ్మరసం పిండి వడ్డించే స్తే సరి.

నా చిట్కా:

ఉల్లిపాయ ముక్కలు పచ్చడితో కలిపి రుబ్బకపోయినా ,తినేటపుడు పచ్చడిలో ఉల్లిచెక్కు కలిపితే బావుంటుంది.

Reviews for Yellow moong daal chutney. Recipe in Telugu (0)