దొండకాయ ముక్కల పచ్చడి | Dondakaya mukkala pachadi Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dondakaya mukkala pachadi recipe in Telugu,దొండకాయ ముక్కల పచ్చడి, Chandrika Marripudi
దొండకాయ ముక్కల పచ్చడిby Chandrika Marripudi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

0

0

దొండకాయ ముక్కల పచ్చడి వంటకం

దొండకాయ ముక్కల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dondakaya mukkala pachadi Recipe in Telugu )

 • దొండకాయలు : 1/2 కేజీ
 • టొమాటోలు : 2
 • పచ్చిమిర్చి : 20
 • నూనె : 6 టేబుల్ స్పూన్లు
 • ధనియాలు : 1 స్పూను
 • జీలకర్ర : 1 స్పూను
 • ఆవాలు : 1 స్పూను
 • మినప్పప్పు : 2 స్పూన్లు
 • శనగపప్పు : 2 స్పూన్లు
 • చింతపండు : ఉసిరి కాయంత
 • వెల్లుల్లి పాయ : 1
 • ఉప్పు : తగినంత
 • కరివేపాకు : 2 రెమ్మలు
 • కొత్తిమీర : కొద్దిగా

దొండకాయ ముక్కల పచ్చడి | How to make Dondakaya mukkala pachadi Recipe in Telugu

 1. దొండకాయలను సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
 2. దోరగా,పండిన దొండకాయ ముక్కలు విడిగా ఒక బాండీలో వేసుకోవాలి.
 3. అందులో 2 టొమాటోలు, పచ్చిమిర్చి, ధనియాలు ,2స్పూన్ల నూనె వేసి వేయించుకోవాలి
 4. అవి బాగావేగాక చల్లారనిచ్చి మిక్సి జార్లో వేసి తగినంత ఉప్పు, చింతపండు,వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సి పట్టాలి.
 5. ఇపుడు బాండీలో 4 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, కరివేపాకు వేసి వేగాక మిక్సి చేసిన పచ్చడిని వేసి కలిపి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి దొండకాయ ముక్కలు వేసి పచ్చడి అంతా కలిసేలా కలిపి 2 నిమిషాలు మగ్గించి కొత్తిమీర వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.
 6. అంతే.రుచికరమైన దొండకాయ ముక్కల పచ్చడి రెడీ.

Reviews for Dondakaya mukkala pachadi Recipe in Telugu (0)