గోంగూర పచ్చడి | Gonguura pachadi Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  28th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gonguura pachadi recipe in Telugu,గోంగూర పచ్చడి, Anitha Rani
గోంగూర పచ్చడిby Anitha Rani
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

గోంగూర పచ్చడి వంటకం

గోంగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gonguura pachadi Recipe in Telugu )

  • గోంగూర....1 కట్ట.....2కప్స్
  • ఎందుమిరపకాయలు....15
  • ఉల్లిపాయ....1
  • వెల్లుల్లి పాయ...1
  • జీలకర్ర....1స్పూన్
  • ధనియాలు...1స్పూన్
  • ఆవాలు...1స్పూన్
  • మినపప్పు,శనగపప్పు....1/2స్పూన్
  • కరివేపాకు...4 ఆకులు
  • ఉప్పు....1స్పూన్. ..తగునంత
  • పసుపు...చిటికెడు
  • నూనె....4 స్పూన్స్

గోంగూర పచ్చడి | How to make Gonguura pachadi Recipe in Telugu

  1. గోంగూర ను కడగండి.నీరు లేకుండా చూసుకోవాలి.
  2. తరువాత పాన్ వేడి అయ్యాక 2స్పూన్స్ నూనె వేసి ఎందుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు,వేసి చిన్న మంట మీద వేగనివ్వాలి. చల్లారిన తరువాత 4 వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి దంచు కోవాలి.
  3. పాన్ లో 1స్పూన్ ఆయిల్ వేసి గూంగుర ను మగ్గనివ్వాలి.కొద్దిగా ఉప్పు,పసుపు వెయ్యాలి.
  4. ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిలో గొంగుర ను వేసి దంచు కోవాలి.
  5. పాన్ పెట్టి ఆయిల్ లో పోపు గింజలు ,ఎందుమిరపకాయలు, కరివేపాకు,ఉల్లిపాముక్కలు,వెల్లుల్లి రెబ్బలు,ఇంగువ వేసి దోరగా వేగాక పచ్చడి వేసి బాగా కలుపు కొని స్టౌ ఆఫ్ చెయ్యాలి.అంతే గొంగుర పచ్చడి తయారు.
  6. ఈ పచ్చడి ని శాకాంబరి ప్రసాదామని కూడా అంటారు.
  7. పులుపు గొంగుర వాదాను కాబట్టి చింతపండు అవసరము లేదు.

నా చిట్కా:

గోంగూర ను ఆర బెట్టడము వలన పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది.

Reviews for Gonguura pachadi Recipe in Telugu (0)