తెల్ల పొట్టి వంకాయల టమాటో పచ్చడి | Brinjal tomato chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Brinjal tomato chutney recipe in Telugu,తెల్ల పొట్టి వంకాయల టమాటో పచ్చడి, Sree Vaishnavi
తెల్ల పొట్టి వంకాయల టమాటో పచ్చడిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

తెల్ల పొట్టి వంకాయల టమాటో పచ్చడి వంటకం

తెల్ల పొట్టి వంకాయల టమాటో పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal tomato chutney Recipe in Telugu )

 • తెల్ల వంకాయలు 1/2 కేజీ
 • టొమాటోలు 5-6
 • పచ్చిమిర్చి 6-7
 • నూనె 5-6 చెంచాలు
 • జీలకర్ర 1 చెంచా
 • పసుపు చిటికెడు
 • ఉప్పు తగినంత
 • ఆవాలు 1 చెంచా
 • మినపప్పు 1 చెంచా
 • సెనగపప్పు 1 చెంచా
 • ఎండుమిర్చి 2
 • కరివేపాకు 1 రెమ్మ

తెల్ల పొట్టి వంకాయల టమాటో పచ్చడి | How to make Brinjal tomato chutney Recipe in Telugu

 1. ముందుగా వంకాయలిని ,టమాటో ,పచ్చిమిర్చి ని ముక్కలు చేసుకోవాలి
 2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి నూనె వేసుకోవాలి అందులో తరిగిన ముక్కలు వేసి మగ్గనివ్వాలి
 3. మగ్గుతున్న దాంట్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి
 4. ఇప్పుడు దాని చల్లరిన తరువాత మిక్సీ చేసుకోవాలి
 5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళి నూనె పోసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి ,కరివేపాకు వేసి వేయించి ఈ పచ్చడిలో వేసి సర్వ్ చేయడమే

Reviews for Brinjal tomato chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo