క్యాలీఫ్లవర్ కాడలు,క్యారెట్, క్యాప్సికమ్,టొమాటో పచ్చడి. | Mixed veg pickle. Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  29th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mixed veg pickle. recipe in Telugu,క్యాలీఫ్లవర్ కాడలు,క్యారెట్, క్యాప్సికమ్,టొమాటో పచ్చడి., Chandrika Marripudi
క్యాలీఫ్లవర్ కాడలు,క్యారెట్, క్యాప్సికమ్,టొమాటో పచ్చడి.by Chandrika Marripudi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

క్యాలీఫ్లవర్ కాడలు,క్యారెట్, క్యాప్సికమ్,టొమాటో పచ్చడి. వంటకం

క్యాలీఫ్లవర్ కాడలు,క్యారెట్, క్యాప్సికమ్,టొమాటో పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed veg pickle. Recipe in Telugu )

  • క్యాలీఫ్లవర్ కాడలు : 1 కప్
  • క్యారెట్ ముక్కలు : 1 కప్
  • క్యాప్సికమ్ ముక్కలు : 1 కప్
  • టొమాటో ముక్కలు : 1 కప్
  • పచ్చిమిర్చి : 20
  • ధనియాలు : 1 స్పూను
  • జీలకర్ర : 1 స్పూను
  • ఆవాలు : 1 స్పూన్
  • మినప్పప్పు : 2 స్పూన్లు
  • పచ్చి శనగపప్పు : 2 స్పూన్లు
  • ఎండుమిర్చి : 2
  • కరివేపాకు :4 రెమ్మలు
  • కొత్తిమీర : కొద్దిగా
  • ఉప్పు : తగినంత
  • నూనె : 4 టేబుల్ స్పూన్లు
  • నిమ్మకాయ : 1
  • వెల్లుల్లి రెబ్బలు : 10

క్యాలీఫ్లవర్ కాడలు,క్యారెట్, క్యాప్సికమ్,టొమాటో పచ్చడి. | How to make Mixed veg pickle. Recipe in Telugu

  1. ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు,పచ్చిమిర్చి, ధనియాలు ఒక బాండీలో వేసుకోవాలి.
  2. 2 స్పూన్ల నూనె వేసి ముక్కలన్నీ మగ్గేవరకు వేయించుకోవాలి.
  3. బాగా మగ్గిన తరువాత చల్లారాక ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో వేసి నూరుకోవాలి.
  4. పచ్చడి తయారయ్యాక అందులో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి.
  5. స్టవ్ పైన బాండీ పెట్టి 2 స్పూన్ల నూనె వేసి పోపుదినుసులు ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి పచ్చడిని వేసి కలపాలి.
  6. చివరగా కొత్తిమీర వేసి కలుపుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

నా చిట్కా:

నిమ్మకాయ లేదా చింతపండు అయినా వేసుకోవచ్చు.

Reviews for Mixed veg pickle. Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo