హోమ్ / వంటకాలు / క్యాలీఫ్లవర్ కాడలు,క్యారెట్, క్యాప్సికమ్,టొమాటో పచ్చడి.

Photo of Mixed veg pickle. by Chandrika Marripudi at BetterButter
561
0
0.0(0)
0

క్యాలీఫ్లవర్ కాడలు,క్యారెట్, క్యాప్సికమ్,టొమాటో పచ్చడి.

Sep-29-2018
Chandrika Marripudi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాలీఫ్లవర్ కాడలు,క్యారెట్, క్యాప్సికమ్,టొమాటో పచ్చడి. రెసిపీ గురించి

టొమాటోలు, క్యారెట్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ కాడలు పచ్చిమిర్చి తో కలిపి వేయించి చేసిన పచ్చడి.హెల్తీ& రుచికరమైన పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 6

  1. క్యాలీఫ్లవర్ కాడలు : 1 కప్
  2. క్యారెట్ ముక్కలు : 1 కప్
  3. క్యాప్సికమ్ ముక్కలు : 1 కప్
  4. టొమాటో ముక్కలు : 1 కప్
  5. పచ్చిమిర్చి : 20
  6. ధనియాలు : 1 స్పూను
  7. జీలకర్ర : 1 స్పూను
  8. ఆవాలు : 1 స్పూన్
  9. మినప్పప్పు : 2 స్పూన్లు
  10. పచ్చి శనగపప్పు : 2 స్పూన్లు
  11. ఎండుమిర్చి : 2
  12. కరివేపాకు :4 రెమ్మలు
  13. కొత్తిమీర : కొద్దిగా
  14. ఉప్పు : తగినంత
  15. నూనె : 4 టేబుల్ స్పూన్లు
  16. నిమ్మకాయ : 1
  17. వెల్లుల్లి రెబ్బలు : 10

సూచనలు

  1. ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు,పచ్చిమిర్చి, ధనియాలు ఒక బాండీలో వేసుకోవాలి.
  2. 2 స్పూన్ల నూనె వేసి ముక్కలన్నీ మగ్గేవరకు వేయించుకోవాలి.
  3. బాగా మగ్గిన తరువాత చల్లారాక ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో వేసి నూరుకోవాలి.
  4. పచ్చడి తయారయ్యాక అందులో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి.
  5. స్టవ్ పైన బాండీ పెట్టి 2 స్పూన్ల నూనె వేసి పోపుదినుసులు ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి పచ్చడిని వేసి కలపాలి.
  6. చివరగా కొత్తిమీర వేసి కలుపుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర