ఇన్ స్టెంట్ గోంగూర పచ్చడి | Instant Gongura chutney Recipe in Telugu

ద్వారా lakshmi kumari  |  29th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Instant Gongura chutney recipe in Telugu,ఇన్ స్టెంట్  గోంగూర పచ్చడి, lakshmi kumari
ఇన్ స్టెంట్ గోంగూర పచ్చడిby lakshmi kumari
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    14

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఇన్ స్టెంట్ గోంగూర పచ్చడి వంటకం

ఇన్ స్టెంట్ గోంగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant Gongura chutney Recipe in Telugu )

  • గోంగూర....1 కట్ట (గోంగూర ఆకులు 1 కప్పు)
  • ఎండుమిర్చి.....4
  • పచ్చి మిర్చి.....3
  • ఉప్పు ....1టీ స్పూన్
  • నూనె ....3 పెద్ద స్పూన్లు
  • పసుపు.... చిటికెడు
  • ఆవాలు...1/2 టీ స్పూన్
  • మెంతులు....1/2 టీ స్పూన్
  • ఇంగువ.... చిటికెడు
  • వెల్లుల్లి రెబ్బలు....6
  • ఉల్లిపాయ ముక్కలు....2 పెద్ద స్పూన్లు

ఇన్ స్టెంట్ గోంగూర పచ్చడి | How to make Instant Gongura chutney Recipe in Telugu

  1. ముందుగా గోంగూర బాగా కడిగి, చిల్లుల బుట్టలో వేసి నీరంతా పోయేదాకా, ఉంచండి.
  2. గోంగూరని తరుక్కోవాలి.
  3. ఇప్పుడు, పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, వేగేక,ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి వేగిన తరువాత, ఉల్లి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
  4. పోపు గింజలు, ఉల్లి ముక్కలు వేెగేక, తరిగి పెట్టుకున్న గోంగూర వేసి , బాగా కలిపి, ఉప్పు, పసుపు వేసి , చిన్న మంట పైన వేగనివ్వాలి.
  5. 10 నిముషాలు వేయించాలి, కలుపుతూ ఉండాలి.
  6. ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
  7. వేడి అన్నం లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.

నా చిట్కా:

ఇదే విధంగా చుక్క కూర కూడా చేసుకోవచ్చు.

Reviews for Instant Gongura chutney Recipe in Telugu (0)