సాబుదానా కిచిడి | Saabudaana kichidi Recipe in Telugu

ద్వారా Radhika Chandra  |  29th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Saabudaana kichidi recipe in Telugu,సాబుదానా కిచిడి, Radhika Chandra
సాబుదానా కిచిడిby Radhika Chandra
 • తయారీకి సమయం

  59

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

సాబుదానా కిచిడి వంటకం

సాబుదానా కిచిడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Saabudaana kichidi Recipe in Telugu )

 • సాబుదానా 200 గ్రా
 • పల్లీలు 100 గ్రా
 • నల్ల ఉప్పు 1 టేబుల్ స్పూన్
 • పోపు గింజలు 1 టీ స్పూన్
 • పచ్చి మిరప కాయలు 3
 • కొత్తి మీరా

సాబుదానా కిచిడి | How to make Saabudaana kichidi Recipe in Telugu

 1. సాబుదానాను వెడల్పాటి పళ్లెం లో కడిగి నీళ్లు వంపేయాలి. కొంత కొంత నీళ్లు చల్లుతూ గంట సేపు నాన పెట్టాలి. వేళ్ళ మధ్యలో పెడితే గింజ నలగాలి.
 2. 2 టేబుల్ స్పూన్ నూనె ని ఒక కడాయి లో వేసి వేడి చేయాలి. అందులో పోపు గింజలు , ఎండు మిర్చి వేసి వేపాలి.
 3. పచ్చి మిర్చి చీలికలు వేసి వేపి నానిన సాబుదానా వేయాలి. కాసేపు వేయించి నల్ల ఉప్పు , వేయించిన పల్లి పొడి , కొత్తి మీర వేసి బాగా కలిపి దింపేయాలి.

నా చిట్కా:

సాబుదానా తక్కువ నానితే గట్టి గ ఉంటుంది. ఎక్కువ నీళ్లు వేస్తే ముద్దా అయిపోతుంది.

Reviews for Saabudaana kichidi Recipe in Telugu (0)