హోమ్ / వంటకాలు / ఆవకాయ.

Photo of Mango pickle. by దూసి గీత at BetterButter
656
3
0.0(0)
1

ఆవకాయ.

Sep-30-2018
దూసి గీత
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవకాయ. రెసిపీ గురించి

తెలుగువారి కే సొంతమైన ప్రత్యేక ఊరగాయ.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. కావల్సిన పదార్థాలు :
  2. 1- పుల్లటి మామిడికాయలు : 12.
  3. 2 - ఆవగుండ : 1/2 కిలో.
  4. 3 - ఖారం : 1/2 కిలో.
  5. 4 - ఉప్పు : 1/2 కిలో.( ఉప్పు కాస్త తగ్గించి వేసుకోవాలి.తర్వాత చూసి మళ్ళీ వెయ్యొచ్చు)
  6. 5 - నూనె : 3/4 కిలో.(నువ్వుల నూనె)
  7. 6 - మెంతులు : 2 చెంచాలు.
  8. 7. - ఇంగువ : 1 చెంచాడు.( ముద్దగా ఉండే పాల ఇంగువ నూరుకుని వేస్తే బావుంటుంది.)
  9. 8 -శనగలు/ వెల్లుల్లి రెబ్బలు : 1 కప్పు (ఆప్షనల్)
  10. 9 - పసుపు : 1/4 చెంచాడు.

సూచనలు

  1. ముందుగా మామిడికాయలని శుభ్రం చేసి, కాయ సైజ్ ని బట్టీ ఒక్కో కాయనూ...6 లేక 8 ముక్కలుగా కొట్టుకోవాలి.లోపల ఉన్న జీడి అవన్నీ తీసేసి తడి బట్ట తో తుడిచి ,మళ్ళీ పొడి బట్టతో కూడా తుడిచి ఆరనివ్వాలి.
  2. ఆవగుండ,ఖారం,ఉప్పు,పసుపు, ఇంగువ అన్నీ కలిపి పెట్టుకోవాలి.
  3. ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ లో కానీ టబ్ లో కానీ, ముందుగా ఆవగుండ మిశ్రమం ఒక లేయర్ వేసి,దానిపైన మామిడికాయ ముక్కలు వెయ్యాలి.ఆ పైన నూనె కాస్త వెయ్యాలి ఇలా అంతా అయిపోయే వరకూ ఒక్కో లేయర్ వేసి తర్వాత అంతా బాగా కలిసేలా..పైకీ ,కిందకీ కలపాలి.
  4. శనగలు కానీ, వెల్లుల్లి పాయ రెబ్బలు కానీ వెయ్యదలుచుకుంటే అవీ, మెతులూ కూడా వేసి బాగా కలిపి,గట్టిగా మూత పెట్టి ఉంచేయాలి‌.
  5. మర్నాడు ఉదయం మళ్ళీ బాగా కలిపి, ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఎడ్జస్ట్ చేసుకోవాలి.
  6. పూర్తిగా 3 రోజులయ్యాక ఆవకాయ బాగా ఊరి రెడీ అవుతుంది.
  7. ఇప్పుడు ఆవకాయని మనం జాడీలో పెట్టుకోవచ్చు.
  8. జాడీలో ముందుగా నూనె వెయ్యాలి. ఆ పైన ఆవకాయ అంతా కొంచెం కొంచెం గా వేసేసి పైన మరి కాస్త నూనె పోసి, శుభ్రమైన బట్ట తో గట్టిగా కట్టి పైన మూత పెట్టెయ్యాలి.
  9. ఎప్పుడు కావలిస్తే అప్పుడు కాస్త ఆవకాయ వేరే చిన్న జాడీ లోకి తీసుకుని వేడి వేడి అన్నంలో ఘుమఘుమలాడే ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే సూపర్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర