ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి | Gooseberry seseme green chillies pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  30th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Gooseberry seseme green chillies pickle recipe in Telugu,ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి, Pravallika Srinivas
ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడిby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి వంటకం

ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gooseberry seseme green chillies pickle Recipe in Telugu )

 • ఉసిరికాయలు 250 gms
 • పచ్చిమిరపకాయలు 200gms
 • నువ్వులు 100gms
 • నువ్వుల నూనె 150
 • ఇంగువ - చిటికెడు
 • ఉప్పు 1 tbsp
 • పసుపు 1/4 tbsp
 • ఆవాలు 1/2 tbsp
 • జీలకర్ర 1/2 tbsp

ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి | How to make Gooseberry seseme green chillies pickle Recipe in Telugu

 1. ముందుగా ఉసిరికాయలను కడిగి పొడి గుడ్డతో శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి.
 2. ఒక పొడిగా ఉన్న కాలాయి లో నువ్వులు వేసి వేగాక ప్లేట్ లో తీసి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో పొడి సిద్ధం చేసుకోవాలి.
 3. పచ్చిమిరపకాయలను కడిగి తొడిమలు తీసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను నిలువ కట్ చేసి సగానికి కట్ చేసుకోవాలి. అన్నినింటిని అలాగే కట్ చేసి సిద్ధం చేసుకోవాలి.
 4. స్టవ్ వెలిగించి కడై పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ వేసి చిటపటలాడాక ఉసిరికాయలను వేసి ఉప్పు ,పసుపు వేసి కలుపుకోవాలి . కడాయి మీద మూత పెట్టి సన్నని సెగ పైన మగ్గనివ్వాలి.ఒక 5 నిముషాలు తర్వాత తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
 5. ఉసిరికాయలు మగ్గిన తర్వాత నువ్వుల పొడి వేసి కలిపి ఒక 5 నిముషాలు కలుపుకోవాలి .
 6. అంతే యంతో రుచికరమైన ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి రెడీ .

నా చిట్కా:

పచ్చడి కాబట్టి అన్ని పాత్రలు & పదార్దాలు పొడిగా ఉంచుకోవాలి.కారం వాడట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నవి వేసుకోవాల

Reviews for Gooseberry seseme green chillies pickle Recipe in Telugu (0)