BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మామిడికాయ నిల్వ పచ్చడి

Photo of Mango Pickle by Pravallika Srinivas at BetterButter
1
0
0(0)
1

మామిడికాయ నిల్వ పచ్చడి

Oct-01-2018
Pravallika Srinivas
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ నిల్వ పచ్చడి రెసిపీ గురించి

గర్బిణులకు ఉదయం లేచాక వికారంగా అనిపించడం, వాంతులు రావడం వంటి సమస్య ఉంటుంది. ఆ సమస్య ఎక్కువగా ఉన్నవారు మామిడికాయని తినడం లేదా వాసన చూడడం చూస్తే వికారం తగ్గుతుంది. తద్వారా వాంతులు కూడా తగ్గుతాయి.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. మామిడికాయ ముక్కలు - 1 kg
  2. ఆవపిండి - 250 gms
  3. మెంతి పిండి - 50gms
  4. నువ్వుల నూనె - 1/2 kg
  5. కారం - 300 gms
  6. ఉప్పు - 300 gms
  7. పొట్టు శనగలు - 50gms
  8. వెల్లులి రెబ్బలు - 100gms

సూచనలు

  1. ముందుగా గండుప్పు ,ఆవాలు ని యండలో పెట్టుకోవాలి .బాగా ఎండిన తర్వాత ఆవాలను మిక్సర్ జార్ లో పొడి కొట్టుకోవాలి. గండుప్పు ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.కొత్త కారం వేస్తే సంవత్సరం అంతా ఎర్రగా రుచిగా ఉంటుంది.మెంతులు ని కాలాయి లో వేయించి చల్లారిన తర్వాత పొడి సిద్ధం చేసుకోవాలి.
  2. మామిడికాయ ఆవకాయ కోసం మేము చిన్న రసాల రకం టెంక ఎక్కువ ఉంటుంది . ఈ పచ్చడి మే మొదటి 10 రోజులు లోపు వచ్చే కాయలు నిలవ పచ్చడి కి సరిఅయిన సమయం. ముందుగా మామిడికాయలు నీటిలో కడిగి పొడి బట్టతో శుభ్రంగా తడిలేకుండా తుడుచుకొని ఆరనివ్వాలి. మొదటి సారి రెండు భాగాలు చేసిన తర్వాత గింజ టెంకుకు ఉన్న పొట్టు కూడా స్పూన్తో తీసివేయాలి. ఇప్పుడు కాయ సైజు ని బట్టి అన్ని కాయలను సమానంగా ముక్కలుగా తరుగుకోవాలి.
  3. ఇప్పుడు ఒక వెడల్పాటి స్థంబాలం తీసుకొని ఉప్పు ,కారం ,ఆవపిండి మెంతిపిండి అన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తరిగిన మామిడికాయ ముక్కలు కూడా కొన్ని వేస్తూ ముక్కలకు అంటే విధంగా కలుపుకోవాలి .అన్ని కలిసిన తర్వాత నువ్వుల నూనె కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వారు పొట్టుసనగలు , వెల్లులి వలిచిన రెబ్బలు కూడా వేయవచ్చు. అన్ని కలిసిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి.
  4. అలాకలిపిన పచ్చడి ని మూడు రోజులు ఊరానివ్వాలి. తర్వాత రోజు తిరగ కలుపుకోవాలి. మీరు ఆ పచ్చడి లో నూనె ఊట గమనిస్తారు .మామిడి ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది. సిద్ధంగా ఉన్న పచ్చడి ని పొడి జాడి లో భద్రపరుచుకోవాలి. అంతే రుచికరమైన మామిడికాయ నిలవ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర