నువ్వుల తొక్కు | Nuvvula thokku( Til chutny) Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  1st Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Nuvvula thokku( Til chutny) recipe in Telugu,నువ్వుల తొక్కు, Harini Balakishan
నువ్వుల తొక్కుby Harini Balakishan
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

నువ్వుల తొక్కు వంటకం

నువ్వుల తొక్కు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Nuvvula thokku( Til chutny) Recipe in Telugu )

  • 50 గ్రాములు తెల్లనువ్వులు
  • ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు
  • ఏడు పచ్చి మిర్చీ
  • కొద్దిగ చింతపండు
  • రుచికి ఉప్పు
  • చిటికెడు పసుపు
  • పోపుకి రెండు చంచా మంచి నూనె
  • అరచంచా ఆవాలు
  • అరచంచా జిలకర
  • సన్నగ తరిగిన ఉల్లిగడ్డ ఒకటి
  • కొత్తి మీర తరుగుడ

నువ్వుల తొక్కు | How to make Nuvvula thokku( Til chutny) Recipe in Telugu

  1. నువ్వులు వెల్లుల్లి కలిపి నూనె లేకుండ వేపాలి. పచ్చి మిర్చీ కూడ వేపాలి( మంట మీద కాలుస్తే తొక్కు ఇంకా రుచిగ ఉంటుంది)
  2. ముందు నువ్వులు వెల్లుల్లి ఉప్పు పొడి కొట్టాలి
  3. పచ్చి మిర్చీ, చింతపండు వేసి నీరు వేసి రుబ్బాలి
  4. రెండు చంచా పల్లీ నూనె వేడి చేసి ఆవాలు జిలకర చిటపటలాడించి పసుపు వేయ్యాలి
  5. పోపును రుబ్బిన తొక్కుతో కలిపితే పచ్చడి రెడీ
  6. నచ్చితే ఉల్లి ముక్కలు కూడ కలపొచ్చు

నా చిట్కా:

పుదీనా, కొత్తిమీర కూడ వేయించి రబ్బవచ్చు. అన్నం , రోటీస్, జొన్నరొట్టె, ఇడ్లీ , దోసా , ఉప్మా , బజ్జీలు అన్నింటికి సెట్ అవుతుంది.

Reviews for Nuvvula thokku( Til chutny) Recipe in Telugu (0)