హోమ్ / వంటకాలు / తీపి మాగాయి.

Photo of Sweet mango magayi pickle. by దూసి గీత at BetterButter
877
2
0.0(0)
0

తీపి మాగాయి.

Oct-02-2018
దూసి గీత
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి మాగాయి. రెసిపీ గురించి

తెలుగువారి ప్రత్యేక ఊరగాయ.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. కావలిసిన పదార్థములు:
  2. 1 మామిడికాయలు : 6
  3. 2 బెల్లం : 1/2 కిలో.
  4. 3. ఉప్పు : 150 గ్రాములు.
  5. 4. నూనె :. 1/4 కిలో.
  6. 5. ఖారం : 2 పెద్ద చెంచాలు.
  7. 6. ఆవాలు : 1 చెంచా
  8. 7. మెంతులు : 2 చెంచాలు.
  9. 8. పసుపు : 1/2 చెంచా.
  10. 9. ఇంగువ. : 1/2 చెంచా.

సూచనలు

  1. ముందుగా మామిడి కాయలు శుభ్రం చేసి, పై తొక్క తీసి,వాటిని పలుచని రేకుల్లా తరగాలి.
  2. ఆ ముక్కలు (టెంకలతో సహా) ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ లో వేసి ఉప్పు,పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఉంచేయాలి.
  3. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఉంచేయాలి..
  4. 3 రోజులయ్యాక బాగా ఊరి ఉంటే వస్తుంది..ఆ ఉంటే అంతా పిండేసి, ముక్కలు, ఊట, వేరు వేరు గా ఎండలో పెట్టాలి. మంచి ఎండ అయితే 2 లేక 3 ఎండలు చాలు.
  5. తర్వాత ముక్కలూ, ఊట రెండూ కలిపి ఒకరోజు ఎండనివ్వాలి‌. ఇదే బేసిక్ మాగాయ.దీంతో తీపి మాగాయ,కారం మాగాయ, మాగాయ పచ్చడీ ఇలా అన్నీ రెడీ చేస్కోవచ్చు.
  6. మూకుడు లో 2, చెంచాలు నూనె వేసి ఆవాలు, మెంతులు, ఇంగువ పోపు వేసుకుని మాగాయ లో వెయ్యాలి.
  7. మిగిలిన నూనె వేసి అది బాగా వేడెక్కిన తర్వాత స్టౌ కట్టేయాలి.. నూనె కాస్త చల్లారి, గోరువెచ్చగా అయ్యాక, ఖారం, మెంతులు వేయించి చేసిన పొడీ..వేసి ఆ మిశ్రమం అంతా మాగాయ లో వేసేయ్యాలి.
  8. ఇంకా చివరిగా దళసరి గిన్నె కానీ ,మూకుడు కానీ స్టౌ మీద పెట్టి కాస్త వేడెక్కాక , బెల్లం వేసి పాకం పట్టాలి‌ బెల్లం అంతా కరిగి ( తీగపాకం అవీ రానవసరం లేదు) బాగా నురగలా వచ్చేప్పుడు స్టౌ కట్టేసి ఆ పాకం అంతా మాగాయ లో వేసేయ్యాలి. అంతే ఘుమఘుమలాడే బెల్లం మాగాయ సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర