తీపి మాగాయి. | Sweet mango magayi pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweet mango magayi pickle. recipe in Telugu,తీపి మాగాయి., దూసి గీత
తీపి మాగాయి.by దూసి గీత
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

తీపి మాగాయి. వంటకం

తీపి మాగాయి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet mango magayi pickle. Recipe in Telugu )

 • కావలిసిన పదార్థములు:
 • 1 మామిడికాయలు : 6
 • 2 బెల్లం : 1/2 కిలో.
 • 3. ఉప్పు : 150 గ్రాములు.
 • 4. నూనె :. 1/4 కిలో.
 • 5. ఖారం : 2 పెద్ద చెంచాలు.
 • 6. ఆవాలు : 1 చెంచా
 • 7. మెంతులు : 2 చెంచాలు.
 • 8. పసుపు : 1/2 చెంచా.
 • 9. ఇంగువ. : 1/2 చెంచా.

తీపి మాగాయి. | How to make Sweet mango magayi pickle. Recipe in Telugu

 1. ముందుగా మామిడి కాయలు శుభ్రం చేసి, పై తొక్క తీసి,వాటిని పలుచని రేకుల్లా తరగాలి.
 2. ఆ ముక్కలు (టెంకలతో సహా) ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ లో వేసి ఉప్పు,పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఉంచేయాలి.
 3. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఉంచేయాలి..
 4. 3 రోజులయ్యాక బాగా ఊరి ఉంటే వస్తుంది..ఆ ఉంటే అంతా పిండేసి, ముక్కలు, ఊట, వేరు వేరు గా ఎండలో పెట్టాలి. మంచి ఎండ అయితే 2 లేక 3 ఎండలు చాలు.
 5. తర్వాత ముక్కలూ, ఊట రెండూ కలిపి ఒకరోజు ఎండనివ్వాలి‌. ఇదే బేసిక్ మాగాయ.దీంతో తీపి మాగాయ,కారం మాగాయ, మాగాయ పచ్చడీ ఇలా అన్నీ రెడీ చేస్కోవచ్చు.
 6. మూకుడు లో 2, చెంచాలు నూనె వేసి ఆవాలు, మెంతులు, ఇంగువ పోపు వేసుకుని మాగాయ లో వెయ్యాలి.
 7. మిగిలిన నూనె వేసి అది బాగా వేడెక్కిన తర్వాత స్టౌ కట్టేయాలి.. నూనె కాస్త చల్లారి, గోరువెచ్చగా అయ్యాక, ఖారం, మెంతులు వేయించి చేసిన పొడీ..వేసి ఆ మిశ్రమం అంతా మాగాయ లో వేసేయ్యాలి.
 8. ఇంకా చివరిగా దళసరి గిన్నె కానీ ,మూకుడు కానీ స్టౌ మీద పెట్టి కాస్త వేడెక్కాక , బెల్లం వేసి పాకం పట్టాలి‌ బెల్లం అంతా కరిగి ( తీగపాకం అవీ రానవసరం లేదు) బాగా నురగలా వచ్చేప్పుడు స్టౌ కట్టేసి ఆ పాకం అంతా మాగాయ లో వేసేయ్యాలి. అంతే ఘుమఘుమలాడే బెల్లం మాగాయ సిద్ధం .

Reviews for Sweet mango magayi pickle. Recipe in Telugu (0)