అరటి దూట పెరుగు పచ్చడి . | Banana stem curd chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Banana stem curd chutney. recipe in Telugu,అరటి దూట పెరుగు పచ్చడి ., దూసి గీత
అరటి దూట పెరుగు పచ్చడి .by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  2

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

అరటి దూట పెరుగు పచ్చడి . వంటకం

అరటి దూట పెరుగు పచ్చడి . తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Banana stem curd chutney. Recipe in Telugu )

 • కావలిసిన పదార్థములు.
 • 1.- అరటిదవ్వ (దూట) : 1
 • 2 - పెరుగు : 1 కప్పు
 • 3 - ఉప్పు :. 1/2 చెంచా.
 • 4 - పచ్చిమిర్చి : 2
 • 5 - ఎండుమిర్చి : 1
 • 6 - పోపు దినులు : మినప్పప్పు,ఆవాలు,జీరా ,మెంతులు అన్నీ కలిపి 1/2 చెంచా.
 • 7 - కరివేపాకు : 1 రెమ్మ.

అరటి దూట పెరుగు పచ్చడి . | How to make Banana stem curd chutney. Recipe in Telugu

 1. ముందు గా పెరుగును చిలికి పక్కన పెట్టుకోవాలి. అరటి దవ్వ ను పలుచని చక్రాలు గా తరగాలి..తరుగుతున్నప్పుడు వచ్చే పీచును వేలికి చుడుతూ తీసి పడేయాలి. ఆ చక్రాలను సన్నని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 2. ఈ ముక్కల్నిఉప్పువేసి 5 నిమిషాలు ఉడికించాలి.ఉడికిన ముక్కల్ని పెరుగులో వేసి, ఉప్పు కలిపి పోపు వేయించుకుని, అందులోనే పచ్చిమిర్చి,కరివేపాకు కూడా వేసి ఆ మిశ్రమం పచ్చడిలో వేసి బాగా కలపాలి. 5 నిమిషాలు ఆగి వడ్డించాలి.

నా చిట్కా:

అరటి దవ్వ తరిగేటపుడు తరిగిన ముక్కలన్నిటినీ పల్చని మజ్జిగ లో వేస్తే నలుపెక్కవు.

Reviews for Banana stem curd chutney. Recipe in Telugu (0)