కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి | CURRY leaves picel Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CURRY leaves picel recipe in Telugu,కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి, Kavitha Perumareddy
కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి వంటకం

కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CURRY leaves picel Recipe in Telugu )

  • కరివేపాకు 2 పెద్దకట్టలు
  • పచ్చిమిర్చి 20
  • చింతపండు నిమ్మకాయ సైజ్
  • జీలకర్ర 2 స్పూన్స్
  • వెల్లుల్లి 10 రెబ్బలు
  • ఉప్పు తగినంత
  • నూనె 2 స్పూన్స్

కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి | How to make CURRY leaves picel Recipe in Telugu

  1. ముందుగా కరివేపాకు శుభ్రంగా కడిగి నీరు ఒడిసి పోనిచ్చి ,ఒక పొడి టవల్ మీద అరబోయాలి.తడిలేకుండా చూసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర ,కరివేపాకు వేసి వేయించి పక్కకు తీసిపెట్టుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, వేసి వేయించుకోవాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.
  5. కరివేపాకు మెత్తగా ఐన తరువాత పక్కకు తీసి పెట్టి పచ్చిమిర్చి మిశ్రమం వేసి దంచుకోవాలి.
  6. పచ్చిమిర్చి బాగా దంచుకున్న తరువాత కరివేపాకు పొడి కూడా వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి. అంతే.కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి రెడీ .వేరే గిన్నెలో తీసుకోవాలి. ఈ పచ్చడి వారం,పది రోజులు ఐనా నిలువ ఉంటుంది. తడి తగలకూడదు.

నా చిట్కా:

కరివేపాకు మరి మాడిపోయేంతగా వేయించుకోకూడదు.కొంచెం గల గల లాడేలా వేయించుకున్న సరిపోతుంది.

Reviews for CURRY leaves picel Recipe in Telugu (0)