హోమ్ / వంటకాలు / కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి

Photo of CURRY leaves picel by Kavitha Perumareddy at BetterButter
273
2
0.0(0)
0

కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి

Oct-02-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ గురించి

కరివేపాకు కూరల్లో వస్తే పక్కన పెట్టేస్తాము.కానీ దానిలో ఎన్నో పోషకాలు వున్నాయి.జుట్టు రాలడం తగ్గిస్తుంది.విటమిన్ ఎ అందుతుంది. కరివేపాకు పొడిని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొదటి ముద్దలో తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇంకా నోరు అరుచి గా వున్నప్పుడు పచ్చడి గాని పొడిగాని తింటే సెట్ అవుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. కరివేపాకు 2 పెద్దకట్టలు
  2. పచ్చిమిర్చి 20
  3. చింతపండు నిమ్మకాయ సైజ్
  4. జీలకర్ర 2 స్పూన్స్
  5. వెల్లుల్లి 10 రెబ్బలు
  6. ఉప్పు తగినంత
  7. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా కరివేపాకు శుభ్రంగా కడిగి నీరు ఒడిసి పోనిచ్చి ,ఒక పొడి టవల్ మీద అరబోయాలి.తడిలేకుండా చూసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర ,కరివేపాకు వేసి వేయించి పక్కకు తీసిపెట్టుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, వేసి వేయించుకోవాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.
  5. కరివేపాకు మెత్తగా ఐన తరువాత పక్కకు తీసి పెట్టి పచ్చిమిర్చి మిశ్రమం వేసి దంచుకోవాలి.
  6. పచ్చిమిర్చి బాగా దంచుకున్న తరువాత కరివేపాకు పొడి కూడా వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి. అంతే.కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి రెడీ .వేరే గిన్నెలో తీసుకోవాలి. ఈ పచ్చడి వారం,పది రోజులు ఐనా నిలువ ఉంటుంది. తడి తగలకూడదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర