సొరకాయ పెరుగు పచ్చడి | Bottle gourd chutney Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bottle gourd chutney recipe in Telugu,సొరకాయ పెరుగు పచ్చడి, Rashmi SudhiMurthy
సొరకాయ పెరుగు పచ్చడిby Rashmi SudhiMurthy
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

సొరకాయ పెరుగు పచ్చడి వంటకం

సొరకాయ పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle gourd chutney Recipe in Telugu )

 • సొరకాయ ముక్కలు 1కప్పు
 • పచ్చి మిరపకాయలు 4
 • పెరుగు 1/2 కప్
 • ఆవాలు 1/4 టీ స్పూన్
 • జీలకర్ర 1/2 టీ స్పూన్
 • పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్
 • ఉప్పు రుచికి సరిపడా
 • నూనె 2టేబుల్ స్పూన్లు
 • పోపు(ఆవాలు,మినప్పప్పు, జీలకర్ర,కరివేపాకు, ఇంగువ)
 • నీళ్ళు తగినంత

సొరకాయ పెరుగు పచ్చడి | How to make Bottle gourd chutney Recipe in Telugu

 1. ముందుగా ఒక పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు,జీలకర్ర వేయాలి
 2. అది చిటపటలాడాక అందులో పచ్చిమిరపకాయలు వేయాలి
 3. అవి వేగాక అందులో సొరకాయ ముక్కలు,ఉప్పు వేయాలి(సొరకాయ తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి)
 4. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని,సొరకాయ ముక్కలని ఉడికించుకోవాలి
 5. అది ఉడికాక అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి
 6. ఇప్పుడు అది చల్లారాక మిక్సీ లో వేసి బరకగా రుబ్బుకోవాలి
 7. ఇది ఒక బౌల్ లోకి తీసుకొని పెరుగు వేసి కలుపుకోవాలి
 8. పోపు కోసం నూనె వేసి ఆవాలు,మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు,ఇంగువ వేయాలి
 9. పోపు చిటపాటలాడక సొరకాయ పెరుగుపచ్చడికి వేసి కలపాలి.
 10. సొరకాయ పెరుగు పచ్చడి రెడీ. అన్నం మరియు పరోట లోకి చాలా బాగుంటుంది

Reviews for Bottle gourd chutney Recipe in Telugu (0)