క్యాబేజీ టమాటా పచ్చడి | Cabbage tomato pachadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cabbage tomato pachadi recipe in Telugu,క్యాబేజీ టమాటా పచ్చడి, Kavitha Perumareddy
క్యాబేజీ టమాటా పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

క్యాబేజీ టమాటా పచ్చడి వంటకం

క్యాబేజీ టమాటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage tomato pachadi Recipe in Telugu )

  • క్యాబేజీ 200 గ్రామ్స్
  • టమాటాలు 3
  • పచ్చిమిర్చి 15
  • జీలకర్ర స్పున్
  • మెంతులు పావుస్పూన్
  • నూనె 3 స్పూన్స్
  • పసుపు కొద్దిగా
  • చింతపండు కొద్దిగా
  • వెల్లుల్లి 5
  • పోపుగింజలు స్పున్
  • కరివేపాకు కొద్దిగా
  • ఎండుమిర్చి పోపుకు 2
  • ఉప్పు తగినంత

క్యాబేజీ టమాటా పచ్చడి | How to make Cabbage tomato pachadi Recipe in Telugu

  1. ముందుగా క్యాబేజీ ని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.టమాటా ,పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి.చింతపండు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర, మెంతులు వేసి వేగినతరువాత పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. తరువాత టమాటాలు కూడా వేసి మగ్గించి పక్కకు తీసిపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు మళ్లీ అదే బాండీలో స్పున్ నూనె వేసి క్యాబేజీ ముక్కలు కొద్దిగా పసుపు వేసి 10 నిముసాలు బాగా మగ్గించాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. టమాటా వేరు చేసి పచ్చిమిర్చి మాత్రమే దంచుకోవాలి. లేకపోతే సరిగా మెదగదు .
  5. పచ్చిమిర్చి దంచిన తరువాత క్యాబేజీ వేసి దంచుకోవాలి. తరువాత మగ్గించిన టమాట,నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి అంతా కలిపి దంచుకోవాలి.
  6. తరువాత స్పున్ నూనె పోపుగింజలు,ఎండుమిర్చి, వెల్లుల్లి,కరివేపాకు తో పోపు పెట్టి పచ్చడిలో కలుపుకోవాలి. అంతే ఇంకా క్యాబేజీ టమాటా పచ్చడి రెడీ. :blush:

నా చిట్కా:

క్యాబేజీ పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి. అప్పుడు రుచిగా ఉండి తినడానికి బాగుంటుంది.

Reviews for Cabbage tomato pachadi Recipe in Telugu (0)