బీట్రూట్ పచ్చడి. | Beetroot chetney Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beetroot chetney recipe in Telugu,బీట్రూట్ పచ్చడి., Chandrika Marripudi
బీట్రూట్ పచ్చడి.by Chandrika Marripudi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

బీట్రూట్ పచ్చడి. వంటకం

బీట్రూట్ పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beetroot chetney Recipe in Telugu )

  • బీట్రూట్ : 2
  • ఎండుమిర్చి : 20
  • జీలకర్ర : 1 స్పూను
  • ఆవాలు : 1 స్పూను
  • ధనియాలు : 2 స్పూన్లు
  • పచ్చిశనగపప్పు : 2 స్పూన్లు
  • మినప్పప్పు : 2 స్పూన్లు
  • మెంతులు : 1/4 టీస్పూన్
  • చింతపండు : చిన్న నిమ్మకాయంత
  • నూనె : 5 స్పూన్లు
  • ఉప్పు : తగినంత
  • వెల్లుల్లి : 8 రెబ్బలు
  • కరివేపాకు : 3 రెమ్మలు

బీట్రూట్ పచ్చడి. | How to make Beetroot chetney Recipe in Telugu

  1. స్టవ్ పైన బాండీ పెట్టి 2 స్పూన్లు నూనె వేసి ఎండుమిర్చి వేసి వేపి ప్లేట్లోకి తీసుకోవాలి.
  2. అదే బాండీలో ధనియాలు, పచ్చిశనగపప్పు,మినప్పప్పు,మెంతులు వేసి వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.
  3. మళ్ళీ బాండీలో 1 స్పూను నూనె వేసి బీట్రూట్ ముక్కలు వేసి వేయించాలి
  4. ముక్కలు వేగాక చింతపండు,వెల్లుల్లి వేసి ప్లేటులోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  5. ఇపుడు ముందుగా ఎండుమిర్చి, పప్పుల మిశ్రమాన్ని ఉప్పు వేసి మిక్సి పట్టాలి.
  6. తరువాత బీట్రూట్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్ళు వేసి మిక్సి పట్టి పచ్చడి చేసుకోవాలి.
  7. బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర,కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టి పచ్చడి వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

నా చిట్కా:

పచ్చడి మరీ మెత్తగా కాకుండా బరకగా చేసుకుంటే బాగుంటుంది.

Reviews for Beetroot chetney Recipe in Telugu (0)