హోమ్ / వంటకాలు / బీట్రూట్ పచ్చడి.

Photo of Beetroot chetney by Chandrika Marripudi at BetterButter
437
0
0.0(0)
0

బీట్రూట్ పచ్చడి.

Oct-03-2018
Chandrika Marripudi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ పచ్చడి. రెసిపీ గురించి

బీట్రూట్ పచ్చడి ఎండుమిర్చి, పప్పులు వేయించి చేసుకున్న పచ్చడి. రుచి ఇంకా ఆరోగ్యకరమైన పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 6

  1. బీట్రూట్ : 2
  2. ఎండుమిర్చి : 20
  3. జీలకర్ర : 1 స్పూను
  4. ఆవాలు : 1 స్పూను
  5. ధనియాలు : 2 స్పూన్లు
  6. పచ్చిశనగపప్పు : 2 స్పూన్లు
  7. మినప్పప్పు : 2 స్పూన్లు
  8. మెంతులు : 1/4 టీస్పూన్
  9. చింతపండు : చిన్న నిమ్మకాయంత
  10. నూనె : 5 స్పూన్లు
  11. ఉప్పు : తగినంత
  12. వెల్లుల్లి : 8 రెబ్బలు
  13. కరివేపాకు : 3 రెమ్మలు

సూచనలు

  1. స్టవ్ పైన బాండీ పెట్టి 2 స్పూన్లు నూనె వేసి ఎండుమిర్చి వేసి వేపి ప్లేట్లోకి తీసుకోవాలి.
  2. అదే బాండీలో ధనియాలు, పచ్చిశనగపప్పు,మినప్పప్పు,మెంతులు వేసి వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.
  3. మళ్ళీ బాండీలో 1 స్పూను నూనె వేసి బీట్రూట్ ముక్కలు వేసి వేయించాలి
  4. ముక్కలు వేగాక చింతపండు,వెల్లుల్లి వేసి ప్లేటులోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  5. ఇపుడు ముందుగా ఎండుమిర్చి, పప్పుల మిశ్రమాన్ని ఉప్పు వేసి మిక్సి పట్టాలి.
  6. తరువాత బీట్రూట్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్ళు వేసి మిక్సి పట్టి పచ్చడి చేసుకోవాలి.
  7. బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర,కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టి పచ్చడి వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర