హోమ్ / వంటకాలు / రాయలసీమ చుక్కకూర పచ్చడి

Photo of RAYALASEEMA chukkakura chatne by malleswari dundu at BetterButter
556
1
0.0(0)
0

రాయలసీమ చుక్కకూర పచ్చడి

Oct-03-2018
malleswari dundu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాయలసీమ చుక్కకూర పచ్చడి రెసిపీ గురించి

ఇది చిత్తూరు జిల్లాలోని స్పెషల్ పచ్చడి. దీనిని రోటిలో కానీ మిక్సీలో కానీ చేయనవసరం లేదు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. చుక్కకూర. 1 కట్ట
  2. పచ్చి మిర్చి 10
  3. ఉల్లిపాయలు 2
  4. నూనె 2 టేబుల్ స్పూన్
  5. తాళింపు దినుసులు 1 స్పూన్
  6. కరివేపాకు 1 రెమ్మ
  7. కొత్తిమీర తగినంత
  8. వెల్లుల్లి రెబ్బలు 2
  9. ఉప్పు తగినంత
  10. వేరు సెనగ పప్పుల పొడి 2 స్పూన్స్
  11. ధనియాల పొడి 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా స్టౌవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి తాలింపు గింజలు వేగించాలి.
  2. అందులో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసి వేగించాలి.
  3. పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి.
  4. తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగించాలి
  5. చుక్కకూర ను కోసి కడిగి పై దానిలో వేసి ఉప్పు కూడా వేసి వేగించాలి.
  6. అది బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, సెనగ గింజల పొడి వేసి కలుపుకోవాలి.
  7. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించాలి అంతే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర