బెల్లం ఆవకాయ | Sweet mango pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweet mango pickle. recipe in Telugu,బెల్లం ఆవకాయ, దూసి గీత
బెల్లం ఆవకాయby దూసి గీత
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

బెల్లం ఆవకాయ వంటకం

బెల్లం ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet mango pickle. Recipe in Telugu )

 • కావలిసిన పదార్థములు..
 • 1 :. ఎక్కువ పులుపు లేని మామిడికాయలు.: 6.
 • 2 : ఆవగుండ : 1/2 కిలో.
 • 3 : ఖారం : 1/4 కిలో
 • 4 : బెల్లం :. 1, కిలో.
 • 5 : ఉప్పు : 1/4 కిలో.
 • 6 : నూనె : 1/2, కిలో.
 • 7 : ఇంగువ : 1/2 చెంచా.
 • 8 : పసుపు : 1/4 చెంచా .

బెల్లం ఆవకాయ | How to make Sweet mango pickle. Recipe in Telugu

 1. మామిడికాయలు శుభ్రం చేసి ఒక్కో కాయనీ పొడవుగా 4 ముక్కలు తరగాలి.
 2. ఉప్పు ,పసుపు, ఖారం, బెల్లం,ఇంగువ అన్నీ కూడా పెద్ద బేసిన్ లో వేసి బాగా కలిపి అందులోనే ,పొడవుగా తరిగిన మామిడికాయ ముక్కలు,నూనె కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.
 3. మరుసటి రోజు తీసి ఒకసారి కలపాలి. మూడు రోజుల తర్వాత తీస్తే పల్చగా ఊట ఊరి ఉంటుంది.ఆ ఊట, ముక్కలు విడి విడి గా ఎండలో పెట్టాలి.
 4. ముక్కల్ని రెండువైపులా తిప్పుతూ నాలుగు రోజులు ఎండపెట్టేక, ఆ ముక్కలని రెగ్యులర్ ఆవకాయ ముక్క సైజ్ లో తరిగి , మళ్ళీ 2 రోజులు ఎండలో పెట్టాలి.
 5. ఈ లోగా ఊట కాస్త చిక్కబడుతుంది. ముక్కలూ ,ఊట, కలిపి రెండు రోజులు ఎండనిస్తే...సరిపోతుంది.
 6. చక్కగా ఎండిన ఆవకాయని జాడీ లోకి తీసుకుంటే సరి ఘుమఘుమలాడే చక్కని రుచికరమైన బెల్లం ఆవకాయ సిద్ధం

నా చిట్కా:

ఈ బెల్లం ఆవకాయ ఊట, పల్చనిది కాస్త తీసి పెట్టుకుంటే, ఇడ్లీలు, దోసెలు, ఉప్మా ల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

Reviews for Sweet mango pickle. Recipe in Telugu (0)