అల్లం పచ్చడి | Gingar chatny Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Gingar chatny recipe in Telugu,అల్లం పచ్చడి, Vandhana Pathuri
అల్లం పచ్చడిby Vandhana Pathuri
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

అల్లం పచ్చడి వంటకం

అల్లం పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gingar chatny Recipe in Telugu )

 • అల్లం 50 గ్రాములు
 • బెల్లం 30 గ్రాములు
 • చింతపండు 30 గ్రాములు
 • ఎండుమిర్చి 8
 • మినపప్పు 2 స్పూన్స్
 • జిరా 1 స్పున్
 • నూనె 2 స్పూన్స్
 • ఉప్పు తగినంత
 • నీళ్లు ఆఫ్ గ్లాస్
 • పోపు కోసం 1 స్పున్ నునే
 • ఆఫ్ స్పున్ ఆవాలు జీలకర్ర
 • ఒక నెమ్మ కరివేపాకు

అల్లం పచ్చడి | How to make Gingar chatny Recipe in Telugu

 1. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి వేడికగానే నూనె వేసి కొంచం హీట్ అయ్యాక మినప్పప్పు , జిరా వేసి దోరగా వేయించుకోవాలి
 2. తరువాత అల్లం ముక్కలు వేయాలి
 3. రెండు నిమిషాల తరువాత ఎండుమిర్చి, బెల్లం ,చింతపండు వేసి మంచి వాసన వచ్చేవరకు అంటే 5 నిమిషాలు వేయించుకోవాలి
 4. తర్వాత సగం గ్లాస్ నీళ్లు పోసి సిం లో ఉడికించాలి
 5. నీరంతా ఇంకిపోయి అల్లం ముక్క మెత్తబడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఉప్పు వేసి దంచుకోవాలి లేదా మిక్సీ పట్టాలి
 6. ఒక స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, జిరా ,కరివేపాకు వేసి పోపు పెట్టుకోని అల్లం పచ్చడిలో కలుపుకోవాలి .

Reviews for Gingar chatny Recipe in Telugu (0)