బీరకాయ చెక్కు టమాట పచ్చడి | Ridge gourd tomato chutney Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridge gourd tomato chutney recipe in Telugu,బీరకాయ చెక్కు టమాట పచ్చడి, Sri Tallapragada Sri Devi
బీరకాయ చెక్కు టమాట పచ్చడిby Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About Ridge gourd tomato chutney Recipe in Telugu

బీరకాయ చెక్కు టమాట పచ్చడి వంటకం

బీరకాయ చెక్కు టమాట పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourd tomato chutney Recipe in Telugu )

  • అర కేజీ బీరకాయలు తరిగిన చెక్కు
  • బాగా పండిన టమాటాలు4
  • చింతపండు కొద్దిగా
  • నూనె చెంచాలు6
  • మిరపకాయలు. 8
  • మెంతులు పావు చెంచా
  • ఆవాలు ఒక చెంచా
  • మినప్పప్పు
  • నవ్వు పప్పు లేదా వేరు శనగపప్పు 2
  • ఇష్టమైతే పంచదార ఒక చెంచా
  • జీలకర్ర ఒక చెంచా
  • కరివేపాకు ఒక రెబ్బ
  • ఉప్పు తగినంత
  • పసుపు చిటికెడు

బీరకాయ చెక్కు టమాట పచ్చడి | How to make Ridge gourd tomato chutney Recipe in Telugu

  1. బీరకాయల గోడు విడిగా తరిగి తీసేసి బీరకాయలు బాగా కడిగి చెక్కు తీసుకోవాలి
  2. నలుగు టమాటాలను ముక్కలుగా తరుగు కోవాలి
  3. టమాటా ముక్కలు బీరకాయ చెక్క చింతపండు మూకుట్లో కొద్దిగా రెండు చెంచాల నూనె వేసి వేయించాలి మరి పొడిపొడిగా కాకుండా కొద్దిగా వేయించాలి
  4. మగ్గి మెత్తబడిన బీర చెక్కు చింతపండు టమాటాలను ప్లేట్ లోకి తీసుకోవాలి
  5. ఇప్పుడు మూకుడు లో మళ్ళీ నూనె వేసి మిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర నువ్వు పప్పు లేదా వేరుశనగ పప్పు పసుపు వేసి ఎర్రగా వేయించుకోవాలి
  6. ముందుగా గ్రైండర్లో పోపును వేసి గ్రైండ్ చేసి తర్వాత బీర చెక్కు టమాటా చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి
  7. ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడి మీద మరల కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పై పోపు గా వేసుకోవాలి
  8. కొద్దిగా తీపి ఇష్టమైతే ఒక అర స్పూన్ పంచదార గాని బెల్లం గాని వేసుకోవచ్చు

నా చిట్కా:

వేరుశనగపప్పు కన్నా నువ్వు పప్పు బాగుంటుంది

Reviews for Ridge gourd tomato chutney Recipe in Telugu (0)