హోమ్ / వంటకాలు / బీరకాయ చెక్కు టమాట పచ్చడి

Photo of Ridge gourd tomato chutney by Sri Tallapragada Sri Devi at BetterButter
734
0
0.0(0)
0

బీరకాయ చెక్కు టమాట పచ్చడి

Oct-03-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ చెక్కు టమాట పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నము మరియు టిఫిన్ కూడా రుచికరంగా ఉండే చెట్ని

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. అర కేజీ బీరకాయలు తరిగిన చెక్కు
  2. బాగా పండిన టమాటాలు4
  3. చింతపండు కొద్దిగా
  4. నూనె చెంచాలు6
  5. మిరపకాయలు. 8
  6. మెంతులు పావు చెంచా
  7. ఆవాలు ఒక చెంచా
  8. మినప్పప్పు
  9. నవ్వు పప్పు లేదా వేరు శనగపప్పు 2
  10. ఇష్టమైతే పంచదార ఒక చెంచా
  11. జీలకర్ర ఒక చెంచా
  12. కరివేపాకు ఒక రెబ్బ
  13. ఉప్పు తగినంత
  14. పసుపు చిటికెడు

సూచనలు

  1. బీరకాయల గోడు విడిగా తరిగి తీసేసి బీరకాయలు బాగా కడిగి చెక్కు తీసుకోవాలి
  2. నలుగు టమాటాలను ముక్కలుగా తరుగు కోవాలి
  3. టమాటా ముక్కలు బీరకాయ చెక్క చింతపండు మూకుట్లో కొద్దిగా రెండు చెంచాల నూనె వేసి వేయించాలి మరి పొడిపొడిగా కాకుండా కొద్దిగా వేయించాలి
  4. మగ్గి మెత్తబడిన బీర చెక్కు చింతపండు టమాటాలను ప్లేట్ లోకి తీసుకోవాలి
  5. ఇప్పుడు మూకుడు లో మళ్ళీ నూనె వేసి మిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర నువ్వు పప్పు లేదా వేరుశనగ పప్పు పసుపు వేసి ఎర్రగా వేయించుకోవాలి
  6. ముందుగా గ్రైండర్లో పోపును వేసి గ్రైండ్ చేసి తర్వాత బీర చెక్కు టమాటా చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి
  7. ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడి మీద మరల కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పై పోపు గా వేసుకోవాలి
  8. కొద్దిగా తీపి ఇష్టమైతే ఒక అర స్పూన్ పంచదార గాని బెల్లం గాని వేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర