పల్లీలు, కొబ్బరి పచ్చడి | Peanuts and coconut chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Peanuts and coconut chutney recipe in Telugu,పల్లీలు, కొబ్బరి పచ్చడి, Kavitha Perumareddy
పల్లీలు, కొబ్బరి పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

పల్లీలు, కొబ్బరి పచ్చడి వంటకం

పల్లీలు, కొబ్బరి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peanuts and coconut chutney Recipe in Telugu )

  • పల్లీలు చిన్న కప్
  • పచ్చికొబ్బరి
  • పచ్చిమిర్చి 10
  • ఉల్లిగడ్డ 1
  • వెల్లుల్లి 6 రెబ్బలు
  • నూనె స్పున్
  • ఉప్పు తగినంత
  • చింతపండు కొద్దిగా

పల్లీలు, కొబ్బరి పచ్చడి | How to make Peanuts and coconut chutney Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ కూడా తరిగి పెట్టుకోవాలి.చింతపండు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి పల్లీలు వేయించుకుని పక్కకు తీసుకొని మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి తరువాత కొబ్బరి ,వెల్లుల్లి వేసి వేపుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా పల్లీలు తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత కొబ్బరి వేసి దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకొని నానబెట్టిన చింతపండు కూడా వేసి అంతా కలిపి దంచుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివే వేసాను.
  4. తరువాత ఒక పచ్చడిని ఒక గిన్నెలో తీసుకోవాలి .అంతే పోపు అవసరం లేదు.ఈ పచ్చడి దోసెలు,ఊతప్పం,సెట్ దోసెలు లోకి చాలా బాగుంటుంది.

నా చిట్కా:

ఉల్లిపాయలు పచ్చివి ఇష్టం లేకపోతే కొంచెం నూనెలో మగ్గించి వేసుకోవచ్చు.

Reviews for Peanuts and coconut chutney Recipe in Telugu (0)