హోమ్ / వంటకాలు / వంకాయ కొత్తిమీర కారం

Photo of VANKAYA kottimeera kaaram by Kavitha Perumareddy at BetterButter
472
0
0.0(0)
0

వంకాయ కొత్తిమీర కారం

Oct-03-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ కొత్తిమీర కారం రెసిపీ గురించి

ఈ పచ్చడిలో కొత్తిమీర ఎక్కువ వేసుకొని చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయలు 2
  2. కొత్తిమీర 2 కట్టలు మీడియం సైజ్ వి
  3. ఎండుమిర్చి 10లేక12
  4. ఉల్లిపాయలు 2
  5. జీలకర్ర స్పున్
  6. మినప్పప్పు స్పున్
  7. ధనియాలు స్పున్
  8. మెంతులు పావుస్పూన్
  9. ఉప్పు తగినంత
  10. నూనె 2 స్పూన్స్
  11. వెల్లుల్లి 6 రెబ్బలు
  12. పసుపు కొద్దిగా
  13. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా కొత్తిమీర శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి.ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి.వంకాయలు తరిగి ఉప్పునీటిలో వేసిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, మెంతులు వేసి వేగినతరువత ఎండుమిర్చి వేసి వేపుకోవాలి .తరువాత ఉల్లిపాయలు ముక్కలు ,వెల్లుల్లిని కూడా వేసి వేపుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు అదే బాండీలో స్పున్ నూనె వేసి వంకాయముక్కలు వేసి వేపుకోవాలి.తరువాత కొత్తిమీర,కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి 5 నిముసాలు పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి మెత్తగా దంచుకోవాలి, తరువాత వంకాయ కొత్తిమీర మిశ్రమాన్ని వేసి అంతా కలిపి దంచుకోవాలి.నిమ్మరసం వేసి కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. అంతే ఇంకా వంకాయ కొత్తిమీర కారం రెడీ ...ఇంకా గిన్నెలో తీసుకొని వడ్డించడమే ...పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర