క్యాబేజీ ఊరగాయ | Cabbage pickle Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cabbage pickle recipe in Telugu,క్యాబేజీ ఊరగాయ, Kavitha Perumareddy
క్యాబేజీ ఊరగాయby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

క్యాబేజీ ఊరగాయ వంటకం

క్యాబేజీ ఊరగాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage pickle Recipe in Telugu )

 • క్యాబేజీ అరకేజీ
 • కారం టీ గ్లాస్
 • ఉప్పు ముప్పావు గ్లాస్
 • పసుపు స్పున్
 • ఆవ పిండి సగం గ్లాస్
 • మెంతి పిండి సగం స్పున్
 • జీలకర్ర పొడి స్పున్
 • నూనె 2 టీ గ్లాస్స్
 • ఇంగువ పావు స్పూన్
 • పోపుగింజలు 2 స్పూన్స్
 • కరివేపాకు గుప్పెడు
 • ఎండుమిర్చి 3 పోపుకు
 • వెల్లుల్లి రెబ్బలు 10
 • నిమ్మరసం 5 కాయలది

క్యాబేజీ ఊరగాయ | How to make Cabbage pickle Recipe in Telugu

 1. ముందుగా క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి.
 2. ఇప్పుడు క్యాబేజీ ఒక బేసిన్ లో వేసుకొని 2 స్పూన్స్ నూనె, పసుపు వేసి అంతా కలిసేలా బాగా కలిపి పెట్టుకోవాలి.15 నిముసాలు ఉండాలి.
 3. ఈలోపు పోయిమీద బాండీ పెట్టి రెండు టీ గ్లాసుల నూనె వేసి వేడి చేసి పోపుగింజలు,ఎండుమిర్చి, చితక్కోట్టిన వెళ్లులి, కరివేపాకు వేసి పోపు వేగనివ్వాలి.ఇంగువ కూడా వేసుకోవాలి.పోపు చల్లారనివ్వాలి.
 4. ఇప్పుడు క్యాబేజీ ముక్కల్లో కారం,ఉప్పు,ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. తరువాత చల్లారిన నూనె,పోపువేసి కలిపి మూత పెట్టాలి.రెండురోజుల తరువాత మళ్ళీ బాగా కలిపి శుభ్రమైన జాడీలో తీసుకొని భద్రపరుచుకోవాలి.తడి తగలకుండా ఉంటే 2 నెలలు ఐనా నిలువ ఉంటుంది. నూనె పైన తేలే తట్టు ఉండాలి.

నా చిట్కా:

ఏ నిలువ పచ్చడికి ఐనా పైన నూనెకొంచెం తేలుతూ ఉంటే చాలా రోజులు నిలువ వుంటుంది.

Reviews for Cabbage pickle Recipe in Telugu (0)