దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యాబేజీ ఊరగాయ

Photo of Cabbage pickle by Kavitha Perumareddy at BetterButter
0
0
0(0)
0

క్యాబేజీ ఊరగాయ

Oct-03-2018
Kavitha Perumareddy
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ ఊరగాయ రెసిపీ గురించి

క్యాబేజీ ఊరగాయ పచ్చి క్యాబేజినే వాడుతాము. టేస్ట్ చాలా బాగుంటుంది. తింటూ వుంటుంటే ముక్కలు పంటికింద నలుగుతూ క్రంచీగా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. క్యాబేజీ అరకేజీ
  2. కారం టీ గ్లాస్
  3. ఉప్పు ముప్పావు గ్లాస్
  4. పసుపు స్పున్
  5. ఆవ పిండి సగం గ్లాస్
  6. మెంతి పిండి సగం స్పున్
  7. జీలకర్ర పొడి స్పున్
  8. నూనె 2 టీ గ్లాస్స్
  9. ఇంగువ పావు స్పూన్
  10. పోపుగింజలు 2 స్పూన్స్
  11. కరివేపాకు గుప్పెడు
  12. ఎండుమిర్చి 3 పోపుకు
  13. వెల్లుల్లి రెబ్బలు 10
  14. నిమ్మరసం 5 కాయలది

సూచనలు

  1. ముందుగా క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు క్యాబేజీ ఒక బేసిన్ లో వేసుకొని 2 స్పూన్స్ నూనె, పసుపు వేసి అంతా కలిసేలా బాగా కలిపి పెట్టుకోవాలి.15 నిముసాలు ఉండాలి.
  3. ఈలోపు పోయిమీద బాండీ పెట్టి రెండు టీ గ్లాసుల నూనె వేసి వేడి చేసి పోపుగింజలు,ఎండుమిర్చి, చితక్కోట్టిన వెళ్లులి, కరివేపాకు వేసి పోపు వేగనివ్వాలి.ఇంగువ కూడా వేసుకోవాలి.పోపు చల్లారనివ్వాలి.
  4. ఇప్పుడు క్యాబేజీ ముక్కల్లో కారం,ఉప్పు,ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. తరువాత చల్లారిన నూనె,పోపువేసి కలిపి మూత పెట్టాలి.రెండురోజుల తరువాత మళ్ళీ బాగా కలిపి శుభ్రమైన జాడీలో తీసుకొని భద్రపరుచుకోవాలి.తడి తగలకుండా ఉంటే 2 నెలలు ఐనా నిలువ ఉంటుంది. నూనె పైన తేలే తట్టు ఉండాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర