బెల్లం ఆవకాయ | Bellam aavakaaya Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bellam aavakaaya recipe in Telugu,బెల్లం ఆవకాయ, రమ్య వూటుకూరి
బెల్లం ఆవకాయby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  82

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

బెల్లం ఆవకాయ వంటకం

బెల్లం ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bellam aavakaaya Recipe in Telugu )

 • మామిడికాయలు 6(పులుపు తక్కువ ఉండేవి)
 • ఆవపిండి 1 కప్
 • ఉప్పు 1కప్పు
 • బెల్లం 2 కప్స్
 • కారం 1 కప్పు
 • మెంతులు 1 స్పూన్
 • చింతపండు నిమ్మకాయంత
 • నువ్వులనూనె 2 కప్స్
 • వెల్లుల్లి 1/2 కప్

బెల్లం ఆవకాయ | How to make Bellam aavakaaya Recipe in Telugu

 1. మామిడికాయలు కడిగి ఆరబెట్టి ముక్కలు కోసుకోవాలి
 2. లోపల జీడీ తీసి బట్టతో తుఫుచుకోవాలి
 3. ఈ ముక్కల్లో బెల్లం ఉప్పు కారం ఆవపిండి మెంతులు చింతపండు వేసుకొని బాగా కలిపి 3 రోజులు ఉంచాలి
 4. మామిడి ఊట లో బెల్లం కరిగి నీరు వస్తుంది. చింతపండు కూడా బాగా నానుతుంది
 5. దీన్ని 3 వ రోజు ఎండలో పెట్టుకోవాలి
 6. ఎండకు నీరు అంతా ఆవిరి అయ్యి పచ్చడి గట్టిపడేవరకు ఎండలో పెట్టుకోవాలి
 7. బెల్లం పాకం గట్టిపడి రంగు కూడా డార్క్ అయ్యేక పచ్చడి కి వెల్లుల్లి కలిపి జాడీలో భద్రపరచుకోవాలి
 8. ఏడాది నిల్వ ఉండే బెల్లం ఆవకాయ రెడీ

నా చిట్కా:

పచ్చడి ఎండలో పెట్టేటప్పుడు పల్చటి వస్త్రం కప్పితే డస్ట్ పడదు ఈగలు రావు

Reviews for Bellam aavakaaya Recipe in Telugu (0)