వంకాయ పచ్చడి | Brinjal chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal chutney recipe in Telugu,వంకాయ పచ్చడి, Sree Vaishnavi
వంకాయ పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

వంకాయ పచ్చడి వంటకం

వంకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal chutney Recipe in Telugu )

  • పచ్చిమిర్చి 3
  • 1 చెంచా సెనగపప్పు
  • 1/2 చెంచా మినపప్పు
  • 4 వంకాయలు
  • 1 టమాటో
  • చింతపండు బఠాణి అంత
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • కొత్తిమీర తరిగినది 3 చెంచాలు
  • 1/2 చెంచా ఆవాలు
  • 1 చెంచా జీలకర్ర
  • 1 రెమ్మ కరివేపాకు
  • ఎండుమిర్చి 2
  • ఇంగువ చిటికెడు

వంకాయ పచ్చడి | How to make Brinjal chutney Recipe in Telugu

  1. ముందుగా ఒక బాండి లో నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి
  2. ఇప్పుడు అందులోనే తరిగిన వంకాయ ముక్కలు వేసి వేయించాలి
  3. ఇప్పుడు అది వేగాక అందులో ఉప్పు కూడా వేసుకోవాలి
  4. అందులోనే టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చలరనిచ్చి మిక్సీ చేసుకోవాలి
  6. అందులో చింతపండు వేసుకుని మిక్సీ చేయాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు ,ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
  8. దానిని పచ్చడిలో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

Reviews for Brinjal chutney Recipe in Telugu (0)