పండు దొండకాయలు పచ్చడి | Ripened Tindora pickle Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ripened Tindora pickle recipe in Telugu,పండు దొండకాయలు పచ్చడి, Kavitha Perumareddy
పండు దొండకాయలు పచ్చడిby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

పండు దొండకాయలు పచ్చడి వంటకం

పండు దొండకాయలు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ripened Tindora pickle Recipe in Telugu )

 • పండిన దొండకాయలు సుమారు 200 గ్రాములు అంటే 20 ఉండొచ్చు.
 • పండిన మిరపకాయలు 8
 • టమాటాలు 2
 • జీలకర్ర స్పున్
 • వెల్లుల్లి 5 రెబ్బలు
 • ఉప్పు తగినంత
 • కరివేపాకు కొద్దిగా
 • కొత్తిమీర గుప్పెడు
 • పసుపు కొంచెం

పండు దొండకాయలు పచ్చడి | How to make Ripened Tindora pickle Recipe in Telugu

 1. ముందుగా కూరగాయలు అన్ని కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
 2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర,దొండకాయలు,పండుమిర్చి , టమాటా ముక్కలు,వెల్లుల్లి,తగినంత ఉప్పు,కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసి కలిపి 10 నిముసాలు మగ్గించాలి.
 3. ఇప్పుడు రోటిలో ఈ మిశ్రమం వేసి దంచుకోవాలి.
 4. అంతా బాగా దంచుకున్న తరువాత గిన్నెలో తీసుకోవాలి.పోపు వేయలేదు .లేకున్నా బాగుంటుంది.మిక్షిలో ఐనా వేసుకోవచ్చు.

నా చిట్కా:

వీలున్న వరకు వంటలల్లో ఆకుకూరలు వేసి వండుకుంటే మంచిది.పుదీనా ,కరివేపాకు, కొత్తిమీర ఇలా అన్ని వేసుకోవాలి.

Reviews for Ripened Tindora pickle Recipe in Telugu (0)