హోమ్ / వంటకాలు / మెంతికూర కొత్తిమీర పచ్చడి

Photo of Fenugreek and coriander leaves chutney by Kavitha Perumareddy at BetterButter
756
3
0.0(0)
0

మెంతికూర కొత్తిమీర పచ్చడి

Oct-04-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

మన ఆహారంలో విరివిగా ఆకుకూరలు వాడాలి. అప్పుడే విటమిన్లు అందుతాయి. బ్లడ్ లెవల్,ప్లేట్లెట్స్ లెవల్ పెరుగుతుంది. అందుకని ఇలా అన్నీరకాలు కలిపి చేసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతికూర 2 కట్టలు
  2. కొత్తిమీర 1 కట్ట
  3. కరివేపాకు గుప్పెడు
  4. పచ్చిమిర్చి 8
  5. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్
  6. జీలకర్ర స్పున్
  7. ధనియాలు స్పున్
  8. వెల్లుల్లి 5 రెబ్బలు
  9. నూనె 2 స్పూన్స్
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా ఆకుకూరలు శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు వేసి వేగినతరువత పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిని వేసి వేపుకొని పక్కకు తీసుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.
  5. తరువాత మెంతికూర మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా దంచుకోవాలి. తరువాత గిన్నెలోకి తీసుకోవాలి.పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర