కర్జూరం పచ్చడి | Dates Pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dates Pickle recipe in Telugu,కర్జూరం పచ్చడి, Pravallika Srinivas
కర్జూరం పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కర్జూరం పచ్చడి వంటకం

కర్జూరం పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dates Pickle Recipe in Telugu )

  • కర్జూరం - 1 cup
  • అల్లం - 2 inches
  • వెల్లులి - 10
  • నువ్వుల నూనె - 4 tbsp
  • ఉప్పు - 1 tbsp
  • కారం - 1 tbsp
  • కాశ్మీరి కారం - 2 tbsp
  • పసుపు - 1/4 tbsp
  • నీరు - 1 glass
  • ఆవాలు - 1/2 tbsp
  • జీలకర్ర - 1/2 tbsp
  • ఇంగువ - 1 pinch
  • వెనిగర్ - 2 tbsp

కర్జూరం పచ్చడి | How to make Dates Pickle Recipe in Telugu

  1. ముందుగా ఖర్జురాలను గింజలు వలిచి ముక్కలు చేసుకోవాలి.
  2. అల్లం ,వెల్లులి కట్ చేసి ముక్కలు చేసుకోవాలి.
  3. తర్వాత ఒక గిన్నిలో ఉప్పు ,కారం ,కాశ్మీరి కారం, పసుపు వేసి సిద్ధం చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఒక కడై పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర ,ఇంగువ ,అల్లం ముక్కలు ,వెల్లులి ముక్కలు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న కారం మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. కజ్జురం ముక్కలు కూడా వేసి నీరు పోసి కలుపుకొని సన్నని మంటపై మగ్గనివ్వాలి .
  5. ఇప్పుడు వెనిగర్ వేసి కలుపుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే చల్లారిన తర్వాత సీసా లో భద్రపరుచుకోవాలి. అంతే రుచికరమైన ఖర్జురామ్ పచ్చడి రెడీ.

నా చిట్కా:

కారం నూనె లో డైరెక్ట్ గా వేయకుండా కొంచం నీటిలో కలపడం వలన మాడువాసన రాదు

Reviews for Dates Pickle Recipe in Telugu (0)