టమాటా నువ్వుల పచ్చడి | Tomato sesame seeds chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato sesame seeds chutney recipe in Telugu,టమాటా నువ్వుల పచ్చడి, Kavitha Perumareddy
టమాటా నువ్వుల పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

టమాటా నువ్వుల పచ్చడి వంటకం

టమాటా నువ్వుల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato sesame seeds chutney Recipe in Telugu )

  • టమాటా లు 4
  • తెల్ల నువ్వులు 4 స్పూన్స్
  • ఎండుమిర్చి 10
  • జీలకర్ర స్పున్
  • ఆవాలు స్పున్
  • మినపప్పు స్పున్
  • మెంతులు పావుస్పూన్
  • పసుపు కొద్దిగా
  • ఉప్పు తగినంత
  • నూనె 2 స్పూన్స్
  • వెల్లుల్లి 5 రెబ్బలు

టమాటా నువ్వుల పచ్చడి | How to make Tomato sesame seeds chutney Recipe in Telugu

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, మినపప్పు, ఆవాలు, మెంతులు,ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. తరువాత నువ్వులు వేసుకొని వేపుకోవాలి.వీటిని వేరే ప్లేట్లో తీసిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బాండీలో స్పున్ నూనె వేసి టమాటా ముక్కలు ,కొద్దిగా పసుపు,వెల్లుల్లిని వేసి 5 నిముసాలు బాగా మెత్తగా మగ్గించుకోవాలి.
  3. తరువాత రోటిలో ముందుగా ఎండుమిర్చి ,నువ్వులు, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి.
  4. ఎండుమిర్చి మెత్తగా ఐన తరువాత టమాటా మిశ్రమం వేసి అంతా కలిపి బాగా నూరుకోవాలి. తరువాత గిన్నెలో తీసుకోవాలి.పోపు కావాలి అంటే వేసుకోవచ్చు.

నా చిట్కా:

ఎండుమిర్చి వేగినతరువత కాసేపు చల్లారిన తరువాత దంచుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి వేడిమీద మెత్తగా ఉంటాయి నలగవు.

Reviews for Tomato sesame seeds chutney Recipe in Telugu (0)