ఉగాది పచ్చడి | Ugadi Pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ugadi Pickle recipe in Telugu,ఉగాది పచ్చడి, Pravallika Srinivas
ఉగాది పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

ఉగాది పచ్చడి వంటకం

ఉగాది పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ugadi Pickle Recipe in Telugu )

  • బెల్లం 2tbsp
  • లేత మామిడి 1
  • వేపపూత 10 రెమ్మలు
  • ఉప్పు 1/4 tbsp
  • కారం 1/4 tbsp
  • చింతపండు నిమ్మపండు అంత

ఉగాది పచ్చడి | How to make Ugadi Pickle Recipe in Telugu

  1. ఇప్పుడు నేను చేసిన ఉగాది పచ్చడిలో 6 రుచులతో చేయబడినది. ముందుగా చింతపండు ని నీటిలో నానపెట్టి చింతపండు రసం సిద్ధం చేసుకోవాలి. తర్వాత మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బాగా విచ్చిన వేపపూత తీస్కొని రెక్కలు మాత్రమే తీసి సిద్ధంగా పెట్టాలి. బెల్లం ని తురుముకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నిలో చింతపండు రసం, బెల్లం వేసి కలుపుకోవాలి.ఉప్పు ,కారం, వేపపూత ,తరిగిన మామిడి ముక్కలు వేసి చక్కగా కలుపుకోవాలి.
  3. బెల్లం లోని తీపి , చింతపండు లోని పులుపు ,లేత మామిడి లోని వగరు , వేపపూత లోని చిరు చేదు , ఉప్పు లో ఉప్పదనం , కారంలో ఘాటు అన్ని కలిపిన షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధం

నా చిట్కా:

ఈ పచ్చడిలో ఆరు రుచులు మాత్రమే వేయాలి. ఆధునికత కోసం మరి ఏవి కలపకూడదు.

Reviews for Ugadi Pickle Recipe in Telugu (0)