హోమ్ / వంటకాలు / ఉగాది పచ్చడి

Photo of Ugadi Pickle by Pravallika Srinivas at BetterButter
496
1
0.0(0)
0

ఉగాది పచ్చడి

Oct-04-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉగాది పచ్చడి రెసిపీ గురించి

ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. బెల్లం 2tbsp
  2. లేత మామిడి 1
  3. వేపపూత 10 రెమ్మలు
  4. ఉప్పు 1/4 tbsp
  5. కారం 1/4 tbsp
  6. చింతపండు నిమ్మపండు అంత

సూచనలు

  1. ఇప్పుడు నేను చేసిన ఉగాది పచ్చడిలో 6 రుచులతో చేయబడినది. ముందుగా చింతపండు ని నీటిలో నానపెట్టి చింతపండు రసం సిద్ధం చేసుకోవాలి. తర్వాత మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బాగా విచ్చిన వేపపూత తీస్కొని రెక్కలు మాత్రమే తీసి సిద్ధంగా పెట్టాలి. బెల్లం ని తురుముకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నిలో చింతపండు రసం, బెల్లం వేసి కలుపుకోవాలి.ఉప్పు ,కారం, వేపపూత ,తరిగిన మామిడి ముక్కలు వేసి చక్కగా కలుపుకోవాలి.
  3. బెల్లం లోని తీపి , చింతపండు లోని పులుపు ,లేత మామిడి లోని వగరు , వేపపూత లోని చిరు చేదు , ఉప్పు లో ఉప్పదనం , కారంలో ఘాటు అన్ని కలిపిన షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర