హోమ్ / వంటకాలు / కొబ్బరి యండుమిర్చి పచ్చడి

Photo of Coconut dryredchillies Chutney by Pravallika Srinivas at BetterButter
364
1
0.0(0)
0

కొబ్బరి యండుమిర్చి పచ్చడి

Oct-04-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి యండుమిర్చి పచ్చడి రెసిపీ గురించి

కొబ్బరిలో పీచు ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలి అనుకొనే వారికి ఇది చాలా మంచిది.కొబ్బరి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుంది. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ ను బయటకు పంపేస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలోను కీలకపాత్ర పోషిస్తాయి.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. కొబ్బరి కాయ - 1/2
  2. యండుమిరపకాయలు 10
  3. చింతపండు - నిమ్మపండు అంత
  4. నూనె - 3 tbsp
  5. ధనియాలు - 2 tbsp
  6. జీలకర్ర - 1/4 tbsp
  7. ఉప్పు - 1/2 tbsp
  8. బెల్లం - 1 tbsp

సూచనలు

  1. ముందుగా కొబ్బరి కాయను పగల కొట్టి కొబ్బరిని చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నిలో చింతపండుని నీటిలో నానపెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి కడై పెట్టి నూనె వేసి కాగాక యండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనె లో కొబ్బరి ముక్కలు వేసి వేగనివ్వాలి. కొంచం రంగు మారాక ప్లేట్ లో తీసుకోవాలి. అదే నూనె లో ధనియాలు వేసి వేయించుకోవాలి. చివర్లో జీలకర్ర వేసి వేగాక పక్కన పెట్టుకోవాలి.
  3. అన్ని పదార్దాలు చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసి నానపెట్టిన చింతపండు, ఉప్పు ,బెల్లం వేసి కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. అంతే రుచికరమైన కొబ్బరి యండుమిర్చి పచ్చడి రెడీీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర