మామిడికాయ ఉల్లిగడ్డ కారం | Raw mango onion chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Raw mango onion chutney  by Kavitha Perumareddy at BetterButter
మామిడికాయ ఉల్లిగడ్డ కారంby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

24

0

మామిడికాయ ఉల్లిగడ్డ కారం వంటకం

మామిడికాయ ఉల్లిగడ్డ కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw mango onion chutney Recipe in Telugu )

  • మామిడికాయ 1
  • ఉల్లిగడ్డ లు 4
  • ఎండుమిర్చి 15
  • జీలకర్ర స్పున్
  • మినపప్పు స్పున్
  • మెంతులు పావు స్పున్
  • సెనగపప్పు స్పున్
  • నూనె 3 స్పూన్స్
  • పోపుగింజలు స్పున్
  • కరివేపాకు కొద్దిగా
  • ఉప్పు తగినంత

మామిడికాయ ఉల్లిగడ్డ కారం | How to make Raw mango onion chutney Recipe in Telugu

  1. ముందుగా మామిడికాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ లు పొట్టుతీసి పెట్టుకోవాలి.
  2. పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, మెంతులు,ఎండుమిర్చి వేపుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన పప్పులు , ఎండుమిర్చి ,తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.
  4. తరువాత మామిడికాయ ముక్కలు దంచుకోవాలి, తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి.
  5. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి పోపుగింజలు,వెల్లుల్లి, కరివేపాకువేసి వేగనిచ్చి పచ్చడి వేసుకొని కలిపి 5 నిముసాలు మగ్గించాలి. తరువాత గిన్నెలో తీసుకోవాలి.

నా చిట్కా:

మామిడికాయ మరీ మెత్తగా దంచుతే రుచి అంతగా ఉండదు. పైన చెక్కు కూడా అలాగే ఉంచి దంచుకుంటే బాగుంటుంది. పీచుపదార్థాలు ఉంటాయి.

Reviews for Raw mango onion chutney Recipe in Telugu (0)