హోమ్ / వంటకాలు / వేరుశనగ టమాటో చట్నీ

Photo of Peanut tomato chutney by Aparna Popuri at BetterButter
499
0
0.0(0)
0

వేరుశనగ టమాటో చట్నీ

Oct-04-2018
Aparna Popuri
45 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేరుశనగ టమాటో చట్నీ రెసిపీ గురించి

వేరుశెనగలు వేయించుకుని అందులో టమాటో,మిగిలిన పదార్ధాలు వేసి మగ్గించుకుని అన్ని కలిపి మిక్సీ చేసుకోవడమే .

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పల్లీలు 4 టేబుల్స్పూన్స్
  2. టొమాటో 4
  3. చింతపండు కొంచెం
  4. బెల్లం 1/2 టీస్పూన్
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. పచ్చిమిర్చి 2
  7. మినపప్పు 1 టీస్పూను
  8. ధనియాలు 1 టీస్పూను
  9. జీలకర్ర 1/4 టీస్పూను
  10. ఎండుమిర్చి 2
  11. ఇంగువ కొంచెం
  12. పసుపు కొంచెం
  13. కొత్తిమీర కొంచెం

సూచనలు

  1. 1.ముందు ఒక మూకుడు తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి .స్టవ్ వెలిగించుకుని అందులో వేరుశెనగలు వేసి వేయించుకోవాలి.
  2. 2. వేయించిన వేరుశెనగల పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. 3. తరవాత అదే మూకుడులో కొంచెం నూనె వేసి అందులో మినపప్పు,ధనియాలు,జీలకర్ర ,కొంచెం ఇంగువ,ఎండుమిర్చి వేసి బాగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
  4. 4. తరువాత అదే మూకుడులో తరిగిన టమాటో ముక్కలు ,ఉప్పు,పసుపు, బెల్లం,చింతపండు,పచ్చిమిర్చి అన్ని వేసి పది నిముషాలు మగ్గించుకోవాలి .
  5. 5. టమాటో మిశ్రమం చల్లారాక, మొదట పక్కన పెట్టుకున్న పోపుని మిక్సీలో వేసి మెత్తగా చేసాక అందులో వేరుశెనగలు,మగ్గించుకున్న టమాటో మిశ్రమం,కొత్తిమీర వేసి బాగా మిక్సీ చేసుకుని ఒక బౌల్ లో తీసుకుంటే నోరూరించే వేరుశెనగ టమాటో చట్నీ సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర