దోసకాయ ముక్కల పచ్చడి | Yellow cucumber chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Yellow cucumber chutney recipe in Telugu,దోసకాయ  ముక్కల పచ్చడి, Lalitha Kandala
దోసకాయ ముక్కల పచ్చడిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

దోసకాయ ముక్కల పచ్చడి వంటకం

దోసకాయ ముక్కల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Yellow cucumber chutney Recipe in Telugu )

  • ఒక మీడియం size దోసకాయ
  • 4 పర్చిమిర్చి
  • ఆవాలు 1/2 table స్పూన్
  • మెంతులు 1/4 table స్పూన్
  • నిమ్మకాయ అంత చింతపండు
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు చిటికెడు
  • ఆవాలు, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు ఇంగువ పోపుకు సరిపడా

దోసకాయ ముక్కల పచ్చడి | How to make Yellow cucumber chutney Recipe in Telugu

  1. ముందుగా దోసకాయను బాగా కడిగి పైన తొక్క తీసేసి , గింజలు కూడా తీసి చిన్న చిన్న ముక్కలుగా cut చేసుకోవాలి
  2. ఒక గిన్నెలో నూనె వేసి, ఆవాలు వేయించుకోవాలి
  3. అదే గిన్నెలో మెంతులు కూడా వేసి వేయించుకోవాలి
  4. ఇవి తీసి పక్కన పెట్టి కొంచం నూనె వేసి దోసకాయ ముక్కలు, పర్చిమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు వేసి ముక్కలు కొద్దిగా మెత్తగా అవ్వనివ్వాలి
  5. ఆవాలు, మెంతులు చల్లారాక పొడి చేసుకోవాలి
  6. మిక్సీలో గాని, రోట్లో గాని ముక్కలు కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి
  7. అందులో ఆవ, మెంతి పొడి కూడా కలపాలి.
  8. ఇప్పుడు ఆవాలు, ఇంగువ, కరివేపాకు పోపు పెట్టుకుని రుబ్బుకున్న పచ్చడిలో కలపాలి.

Reviews for Yellow cucumber chutney Recipe in Telugu (0)